Evarest: ఆహా.. అద్భుతమనిపిస్తున్న ఎవరెస్ట్ వీడియో

ప్రస్తుతం ఇంటర్నెట్‌ను మన హిమాలయాలకు సంబంధించిన వీడియో ఊపేస్తోంది. పర్వతాల కింద నుంచి శిఖరాగ్రం వరకు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎంత అద్భుతం మన భారతదేశ తలమానికం అని అనిపిస్తోంది.

New Update
Evarest: ఆహా.. అద్భుతమనిపిస్తున్న ఎవరెస్ట్ వీడియో

Himalaya's Video : భారతదేశానికి (India) తలమానికం ఎవరెస్ట్ పర్వతాలు (Mount Everest). ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలు గాంచినవి ఎవరెస్ట్ శిఖరాలు. మంచుతో కప్పబడి ఎంతో అందంగా ఉంటాయి ఇవి. వీటిని అధిరోహించాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. అందుకే వాటిని దూరం నుంచే చూసి తమ ఆనందాలను తీర్చేసుకుంటారు. అది కూడా చేయలేని వారు ఫోటోలు, వీడియోలు చూసి సంతృప్తిపడుతుంటారు.

ఇలాంటివారి కోసం చైనా (China) కి చెందిన డ్రోన్‌ తయారీ సంస్థ డీజేఐ గ్లోబల్‌.. డ్రోన్‌ సాయంతో అద్భుతమైన వీడియో చిత్రీకరించింది. అందులో హిమాలయాలను ఎంతో అందంగా చిత్రీకరించారు. అక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ (Viral Video) అవుతోంది.

సముద్ర మట్టం నుంచి 3, 500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ నుంచి డ్రోన్‌ను ఉపయోగించారు. మొత్తం హిమాలయాలంతా చూపిస్తూ..శిఖారాగ్రాన్ని కూడా కవర్ చస్తూ వీడియో తీశారు. ఈ వీడియోలో హిమాలయాలు ఎక్కుతున్న , దిగుతున్న వారి దృశ్యాలు కూడా ఉన్నాయి.

Also Read:Telangana: డ్రగ్స్‌ను కంట్రోల్ చేయండి-ఎమ్మెల్యే రాజాసింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు