Himachal Pradesh: ఐదురోజులపాటు వివస్త్రలుగా మగువలు..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

నిండైన వస్త్రధారణ అనేది మన భారతీయ సంప్రదాయం.. అలాగే పాశ్చాత్య దుస్తులను కూడా ఈమధ్య చాలామంది ధరిస్తున్నారు. వస్త్రధారణ అనేది ఎవరి అభిరుచిని బట్టి వారు వేసుకునేది. ఇందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఆచారాలను బట్టే అక్కడి ప్రాంతవాసులు నడుచుకుంటారు. కొన్ని ఆచారాలు వింతగా ఉంటాయి. బాబోయ్ ఇలాంటివి కూడా ఉంటాయా అనిపిస్తుంది. అలాంటి వింత ఆచారాన్ని గురించి మనం తెలుసుకుందాం.

New Update
Himachal Pradesh: ఐదురోజులపాటు వివస్త్రలుగా మగువలు..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Himachal Pradesh Pini Village Festival: పర్యాటక ప్రాంతానికి ప్రకృతి అందాలకు పెట్టింది పేరు హిమాచల్‌ప్రదేశ్. అక్కడ కులు జిల్లాలోని సుందరమైన ప్రకృతి వనంలో పిని అనే ఓ గ్రామం ఇంది. సంప్రదాయ జీవనవిధానానికి ఆ గ్రామం పెట్టింది పేరు. అయితే ఓ వింత ఆచారం ఈ ఊరిలో ఉంది. ఈ పని గ్రామంలో నివసించే మగువలంతా తమకుతాముగా ఏడాదిలో ఓ ఐదురోజుల పాటు అసలు వస్త్రాలను ధరించడం మానేస్తారట. అంతేకాదు ఆడవాళ్లకి మగవాళ్లకి కూడా వేర్వేరు ఆచారాలున్నాయి. వాటిని పాటించాల్సిందే... ఇదేమిటి అని అడిగితే మా తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది అని బదులిస్తారు వాళ్లు.

ఎప్పుడు పాటిస్తారంటే..

పిని గ్రామంలోని (Pini Village) మహిళలందరూ ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ మాసంలో ఓ ఐదురోజుల పాటు ఈ నియమాన్ని పాటిస్తారు. ఆ సమయంలో అసలు ఒంటిపైన నూలుపోగు లేకుండా ఉండాలి. ఇంటి బయటకు రాకుండా ఇంట్లో ఉండే అన్ని పనులను చేయాలి. అంతేకాదు మహిళలు తమ భర్తలను కన్నెత్తి చూడకూడదు. ఒకవేళ చూసినా నవ్వడం, మాట్లాడడం లాంటివి చేయకూడదు. ఇక మహిళలకు ఈ నియమాలుంటే ఇంట్లో ఉన్న పురుషులు తమ ఎదురుగా భార్య ఉన్నా అస్సలు మాట్లాడకూడదు. మద్యం, మాసం నిషేధం. వారితో ఎలాంటి సంబంధం లేకుండా అసలు వారు ఇంట్లో ఉన్నా లేనట్లే నడచుకోవాలి. అంతేకాదు కష్టమైన ఈ ఆచారాన్ని ఇష్టంగా విసుక్కోకుండా పాటించాలి. ఒకవేళ ఇలా పాటించకపోతే వారి కుటుంబానికి చివరికి తమ గ్రామానికి కూడా తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం.

ఈ ఆచారం ఎలా వచ్చిందంటే

ఒకప్పుడు ఈ ఊరిని రాక్షసులు బాధిస్తుండేవారట. వారు మనుషులను ఎత్తుకెళ్లకుండా కేవలం మహిళల దుస్తులను మాత్రమే చింపి తీసుకెళ్లేవాళ్లని గ్రామస్థులు చెబుతారు. దాని పోరును భరించలేక వాళ్లు లహువా ఘోండ్ అనే దేవతను ప్రార్థించారు. వారు శ్రావణమాసంలో కొలిస్తే బాధ్రపదమాసం తొలివారంలో ఆ దేవత ప్రసన్నురాలై ఆ రాక్షసులను తుదుముట్టించందనీ, ఆ దేవతకు పూర్వకంగా ఉండడానికి ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఐదురోజులు స్త్రీలు దుస్తులు ధరించకూడదు అనే నియమం మొదలైందని చెబుతారు. ఇలా తమను తాము శుద్ధి చేసుకోవడమే గాక తమ కుటుంబాన్ని, గ్రామాన్ని చల్లగా చూడమని దేవతను కోరుతూ.. ఇలా బట్టలు విప్పి తమ గౌరవాన్ని చాటుకుంటారట. ఈ ఐదు రోజులూ పిని గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండానే వివిధ పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. వారు గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు ఈ ఐదురోజుల పాటు గ్రామస్తులెవ్వరూ బయటకు వెళ్లరు, బయట గ్రామవాసులు ఈ గ్రామంలోకి రారు. ఒకప్పుడు చాలా నిష్టగా ఈ ఆచారాన్ని పాటించేవారు అక్కడి మహిళలు. అయితే మారుతున్న కాలంతోపాటుగా ఇప్పుడిప్పుడే కాస్త మార్పు మొదలైంది. నేటికాలం వాళ్లు కనీసం చున్నీ అన్నా వేసుకుని ఈ ఆచారాన్ని పాటిస్తుండగా పాతకాలం వాళ్లు ఇంకా అదే పద్ధతిని అక్కడ కొనసాగిస్తున్నారు. ముందు ముందు అయినా ఈ ఆచారం మారుతుందని ఆశిద్దాం.

ఇది కూడా చదదండి: ఎటు చూసినా ప్రమాదకరమైన రోడ్డు .. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం

Advertisment
Advertisment
తాజా కథనాలు