Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో వరదలు.. 35 మంది గల్లంతు! హిమాచల్ ప్రదేశ్ లోని కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత కురిసింది. దాంతో ఇళ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. మూడు ప్రాంతాల్లో దాదాపు 35 మంది గల్లంతయ్యారు. మండిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. By Bhavana 01 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Heavy Rains : దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కారణంగా కుండపోత కురిసింది. దాంతో ఇళ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. మూడు ప్రాంతాల్లో దాదాపు 35 మంది గల్లంతయ్యారు. మండిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా మండిలోని విద్యాసంస్థలను మూసివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మండి తాల్తుఖోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షానికి పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. చాలా చోట్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను (SDRF Team) సంఘటనా స్థలానికి తరలించారు. తేరాంగ్, రాజ్‌బాన్ గ్రామాల్లో మేఘాలు కమ్ముకున్నట్లు తాల్తుఖోడ్ పంచాయతీ అధికారులు వివరించారు. ఈ పాధార్ సబ్ డివిజన్‌లోని తాల్తుఖోడ్‌లో వర్షాలకు తొమ్మిది మంది కనిపించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. మరో 35 మంది సురక్షితంగా బయటపడినట్లు వివరించారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్ సహాయం కోరింది. సిమ్లా-కులు సరిహద్దులోనూ వర్షం విధ్వంసం సృష్టించింది. పలువురు గల్లంతైనట్లు సమాచారం. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సహాయక చర్యలు ప్రారంభించాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కులులోని నిర్మాంద్ ప్రాంతంలో 19 మంది గల్లంతైనట్లు సమాచారం. బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో అంబులెన్స్‌లతో సహా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. కులు జిల్లాలోని కురుస్తున్న భారీ వర్షాలతో రెండు పవర్ ప్రాజెక్టులకు భారీ నష్టం కలిగింది. భారీ వరదలతో పార్వతి నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. బాగీపూల్‌లో ఏడు నుంచి పది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. బాధితులను కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. Also read: ఢిల్లీలో కుండపోత.. ఏడుగురి మృతి! #heavy-rains #himachal-pradesh #cloud-burst మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి