OU Hostel : సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం

సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ లేడీస్‌ హాస్టల్‌ దగ్గర టెన్షన్..టెన్షన్ గా ఉంది. అర్ధరాత్రి గోడదూకి ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌లో దూరడంతో విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ కాలేజీ గేట్లు మూసేసి విద్యార్ధినులు ఆందోళన చేస్తున్నారు.

New Update
OU Hostel : సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం

PG Students : సికింద్రాబాద్(Secunderabad) ఓయూ పీజీ లేడీస్ హాస్టల్‌(OU PG Ladies Hostel) లో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. నిన్న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు లేడీస్ హాస్టల్‌లోకి చొరబడ్డారు. బాత్రూం కిటికీ పగలకొట్టి లోపలికి వచ్చేశారు. విద్యార్థినులపై దాడికి కూడా ప్రయత్నించారు. వీరిలో ఒకరిని పట్టుకొని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. మరొకడు పరారీలో ఉన్నాడు.

Also Read : Nitish Kumar : కూటమిలో కల్లోలం..నితీశ్ యూటర్న్..లెక్కలివే.

ఆందోళనకు దిగిన విద్యార్ధినులు

జరిగిన సంఘటనతో హాస్టల్ విద్యార్ధినులు(Students) చాలా భయాందోళనలకు గురయ్యారు. అప్పటికి తేరుకుని ఒకరి మీద దాడి అయితే చేశాము కానీ తమకు రక్షణ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. దుండగుడిని పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులను విద్యార్ధినులు అడ్డుకున్నారు. కాలేజీ గేటుకు తాళాలు వేసి మరీ ఆందోళనకు దిగారు. రోడ్డు మీద కూర్చుని ధర్నా చేస్తున్నారు. వెంటనే తమకు సెక్యూరిటీ(Security) కల్పించాలని.. సీసీటీవీ(CC TV) లు ఏర్పాటుచేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. వీసీ వచ్చి హామీ ఇస్తేనే కానీ కదలమంటూ తీవ్రంగా ధర్నా చేస్తున్నారు. విద్యార్థినుల ఆందోళనలతో హాస్టల్ దగ్గర అంతా హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

కంటెంట్ అప్డేట్‌లో ఉంది...

Also Read : Crime News: 15 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం.. గర్భం దాల్చడంతో బాలిక ఆత్మహత్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు