Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. మూడు డిగ్రీలు అధికం!

మార్చి నెల కూడా ప్రారంభం కాకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

New Update
TS News: ఎర్రటి ఎండలతో ఉడికిపోతున్న తెలంగాణ..43 డిగ్రీల మార్క్ దాటిన ఉష్ణోగ్రత..!

AP & Telangana Weather: రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా (Temperatures Rise) పెరుగుతున్నాయి. దీంతో ఎండలు విపరీతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఎండలు ఇంకా వేసవి కాలం పూర్తిగా మొదలు కాకముందే నడి వేసవిని తలపిస్తున్నాయి. ఉదయం 11 దాటిన తరువాత ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు హడలి పోతున్నారు.

మార్చి మొదటి వారం కూడా రాకముందే ఏపీలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువగా.. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెల మొదలవుతున్న క్రమంలో ఎండలు తీవ్రమైయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి… 21 మందికి తీవ్ర గాయాలు!

తెలంగాణలో కూడా వాతావరణలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పగటి పూట సుమారు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే పగటి పూట 32 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

మార్చి నెల ప్రారంభం అయితే ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా వడగాలుల తీవ్రత అధికంగా ఉండనున్నట్లు , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రాత్రిపూట చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట మాత్రం ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి.

గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే 32 డిగ్రీలు దాటాయి. దీంతో ఏప్రిల్, మే నెలల్లో ఇంకా అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు