Canada: నిజ్జర్‌ హత్య కేసును కావాలనే తారుమారు చేస్తున్నారు.. భారత్‌ రాయబారి సంచలన ఆరోపణలు

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును కావాలనే ఓ కెనడా అధికారి దెబ్బతీశాడని.. అక్కడి భారత రాయబారి సంజయ్ వర్మ ఆరోపించారు. కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో చేసిన ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉంటే సమర్పించాలంటూ డిమాండ్ చేశారు.

New Update
Canada: నిజ్జర్‌ హత్య కేసును కావాలనే తారుమారు చేస్తున్నారు.. భారత్‌ రాయబారి సంచలన ఆరోపణలు

ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇటీవల కెనడా ప్రధాని జస్టీన్‌ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేయడంతో ఇరుదేశాల మధ్య దౌత్యపర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంపై అక్కడి భారత రాయబారి సంజీవ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య కేసును ఉద్దేశపూర్వకంగానే ఓ కెనడా అధికారి దెబ్బతీశాడని ఆరోపించారు. జస్టీన్ ట్రూడో చేసిన ఆరోపణలను బలపర్చే ఆధారాలుంటే సమర్పించాలంటూ డిమాండ్ చేశారు. ది గ్లోబ్ అండ్ మెయిల్ అనే పత్రికతో మాట్లాడుతూ ఆయన ఇలా మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో నిజ్జర్ హత్య అనంతరం ఈ కేసుపై కెనడా పోలీసుల విచారణ ప్రభావితం చేసేలా ఆ దేశ అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారంటు తెలిపారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో భారత్ సహకరించడానికి అవసరమైన ఆధారాలను ఇప్పటిదాకా సమర్పించలేదని పేర్కొన్నారు.

నిజ్జర్ హత్యలో భారత్, ఆ దేశ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యన్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు జారీ అయ్యాయని.. ఈ కేసు దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారంటూ ఆరోపణలు చేశారు. అలాగే తనకు, సహచర దౌత్యవేత్తలకు కెనడాలో పొంచి ఉన్న ముప్పు గురించి కూడా వర్మ వివరించారు. నా భద్రత పట్ల ఆందోళనగా ఉన్నానని.. మా కాన్సుల్ జనరల్స్ రక్షణ విషయం కూడా భయపెడుతోందని వ్యాఖ్యానించారు.

Also Read: విమానాశ్రయంలో కాల్పులు..నిలిచిన సర్వీసులు!

అయితే నిజ్జర్‌ హత్యకేసుకు సంబంధించి భారత దౌత్యవేత్తల సంభాషణలను కెనడా ఇంటెలిజెన్స్‌ సర్వీసు సేకరించినట్లు ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. కానీ ఈ నివేదికలను సంజీవ్‌ వర్మ ఖండించారు. దౌత్యవేత్తల సంభాషణలకు అంతర్జాతీయ చట్టాల రక్షణ ఉంటుందని.. ఆ సంభాషణలను ఎలా సేకరించారో చూపించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే స్వరాన్ని అనుకరించి మాట్లాడిన మాటలు కాదని నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ఏదైనా వివాదాన్ని నిర్దేశిత కమ్యూనికేషన్‌ ద్వారా.. నిర్దేశిత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇక భారత్‌ను విడదీయాలని కొందరు కెనడా వాసులు ప్రయత్నాలు చేస్తున్నారని.. వాళ్లకి ఎలాంటి సహకారం అందించొద్దని సూచించారు.

Also read: ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ.. టెస్టింగ్ షురూ.

Advertisment
Advertisment
తాజా కథనాలు