Rajahmundry: రాజమండ్రిలో హై అలర్ట్.. అసలేం జరుగుతోందంటే..?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్‌ ఐటీ కంపెనీ ఉద్యోగులు ‘చలో రాజమండ్రి’ కార్యక్రమం నేపథ్యంలో భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తున్నారు. దీంతో ఏపీ పోలీసులు హై అలర్ట్‌ అయ్యారు.

New Update
Rajahmundry: రాజమండ్రిలో హై అలర్ట్.. అసలేం జరుగుతోందంటే..?

చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు భువనేశ్వరి కలిసేందుకు హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో కార్లతో భారీగా వెళ్తున్నారనే సమాచారంతో  రాజమండ్రిలో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఐటీ ఉద్యోగులు చలో రాజమండ్రి పిలుపు నేపథ్యంలో లోకేష్ క్యాంప్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే వాహనాలు ముందుకు పంపిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు.

ఇప్పటికే రాజమండ్రి లోకేష్ క్యాంప్ వద్దకు పలువురు ఐటీ ఉద్యోగులు చేరుకున్నారు. పోలీసులు ఆంక్షలు విధిస్తూ.. వాహనాలు అడ్డుకుంటున్నారని, ప్రత్యామ్నాయ మార్గాలలో రాజమహేంద్రవరం రావడం జరిగిందని పలువురు ఐటీ ఉద్యోగులు తెలిపారు. 2018 స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము లబ్ధి పొందామని పలువురు ఉద్యోగులు తెలిపారు. ఈ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం జంక్షన్ దగ్గర బార్కెట్లు ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాజమండ్రి వైపు పంపిస్తున్నారు. చలో రాజమండ్రి పిలుపునిచ్చిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డిని ముందస్తుగా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.

అయితే.. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఏపీ పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. వారిని కట్టడి చేసేందుకు దాదాపుగా 250 మంది పోలీసులు మోహరించారు. ఏపీ- తెలంగాణ సరిహద్దు దగ్గర పోలీసుల మొహరించి హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీలు చేస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. బోర్డర్ వద్ద ఐడీ కార్డులు, వివరాలను తెలుసుకున్న తర్వాతే వాహనాలను వదిలేస్తున్నారు. పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఖమ్మం జిల్లా మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలు. జనసేన నాయకులతో నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం కోసం టీడీపీ, జనసేన పార్టీలు అన్నదమ్ముల్లా కలసి పోరాడాలని ఆమె సూచించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నేతృత్వంలో  ఇంచార్జ్‌లు, నేతలు కలిసి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిచారు. రేపు జిల్లాలో టీడీపీ దీక్షా శిబిరాలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సందర్శించనున్నారు. ఉదయం 8:30కు అన్నవరం సత్యదేవుని భువనేశ్వరి, బ్రాహ్మణి దర్శించుకోనున్నారు. అనంతరం జగ్గంపేటలో టీడీపీ దీక్ష శిబిరానికి భువనేశ్వరి, బ్రాహ్మణి వెళ్ళనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Government good news : రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Special Education Teachers |

Special Education Teachers |

AP Government good news : ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మందిని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబడనుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ ఉపాధ్యాయులు, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం ద్వారా, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని ఆశిస్తోంది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

    Advertisment
    Advertisment
    Advertisment