Hi Nanna Update: హాయ్.. నాన్న.. సెంటిమెంట్ తో కాదు.. ఎమోషన్ తో పిచ్చెక్కిస్తుందట.. 

నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్..నాన్న సినిమా డిసెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మంచి లవ్.. సెంటిమెంట్.. ఎమోషనల్ సినిమాగా ఇది రాబోతోందని చెబుతున్నారు. నాని కెరీర్ లో మరో సూపర్ హిట్ గ్యారెంటీ అని చెబుతున్నారు. 

New Update
Hi Nanna Update: హాయ్.. నాన్న.. సెంటిమెంట్ తో కాదు.. ఎమోషన్ తో పిచ్చెక్కిస్తుందట.. 

Hi Nanna Movie Update: నేచురల్ స్టార్ నాని (Hero Nani) సినిమా అంటేనే సంథింగ్ స్పెషల్ అని ప్రేక్షకులు అందరూ అనుకుంటారు. క్లాస్ సినిమాలను ఇష్టపడేవారు.. మాస్ సినిమాలపై ఇంట్రస్ట్ ఉండేవారు ఇలాంటి తేడాలు లేకుండా అందరికీ నాని సినిమా అంటే ఒక క్రేజ్. నాని నుంచి సినిమా వస్తుంది అంటే.. ఎదో కొత్తదనం కచ్చితంగా ఉంటుంది అని అనిపిస్తుంది. అదిగో మళ్ళీ అలంటి కొత్తదనాన్ని తీసుకువస్తున్నాను అంటున్నాడు నాని. హాయ్.. నాన్న అంటూ డిసెంబర్ 7న థియేటర్లలో అందరినీ పలకరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్లు.. ట్రైలర్లు.. సినిమా మీద క్లాసికల్ అంచనాలు పెంచేశాయి. సినిమా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ తో ఉంటుందని లెక్కలు వేసేస్తున్నారు. అలాగే, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా సినిమాపై మరింత బజ్ తీసుకువచ్చింది. ఇదిలా ఉంటె సినిమా సెన్సార్ లో క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకుంది. దీంతో నాని కోసమే సినిమా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా హాయ్ నాన్న ఒక ఫీల్ గుడ్ మూవీ అవుతుందనే అంచనా వచ్చేసింది. 

Also Read: యానిమల్ కాసుల వేట.. మూడు రోజుల్లో మూడువందల కోట్లు.. బాహుబలి రికార్డులు ఊదేస్తుందా? 

సినిమాలో నానీతో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. రెండు శృతి హాసన్. ఈ ఇద్దరు సినిమాలో ఉన్నా.. ట్రైలర్ టీజర్ లలో ఎక్కువగా మృణాల్ ఠాకూర్ మాత్రమే కనిపించింది. అయితే, ఇప్పుడు శృతి హాసన్ కు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉందని.. సినిమాకి ఆమె ఉన్న సీన్స్ హైలైట్ అవుతాయని అంటున్నారు. తాజాగా వచ్చిన ప్రకారం బజ్ హాయ్ నాన్న సినిమాకి (Hi Nanna Movie) ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో నాని.. శృతి (Shruthi Haasan) మధ్య వచ్చే లవ్ సీన్స్.. వీరి మధ్య కెమిస్ట్రీ మరో రేంజ్ లో ఉంటుందట. సెంటిమెంట్ సినిమాగా ప్రాజెక్ట్ అవుతున్న ఈ సినిమా నిజానికి మంచి లవ్ స్టోరీ అని ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తే అనిపిస్తుందట.. ఆ సీన్స్ సినిమాని లవ్ స్టోరీల్లోనే టాప్ రేంజ్ లో ఉండేలా తీశారని చెప్పుకుంటున్నారు. ఇక సినిమాలో లవ్.. సెంటిమెంట్ మాత్రమే కాదు.. నాని.. శృతి హాసన్ లవ్ స్టోరీ ముగింపులో వచ్చే విషాదం కూడా ప్రేక్షకులందరినీ కన్నీళ్లతో కట్టిపడేస్తాయని తెలుస్తోంది. మొత్తంగా సినిమా లవ్.. సెంటిమెంట్.. ట్రాజెడీ ఇలా అన్ని కోణాల్లోనూ సాగుతుందని అర్ధం అవుతోంది. ఆఫ్ కోర్స్ నాని సినిమా కాబట్టే సిట్యుయేషనల్ కామెడీ కచ్చితంగా ఉంటుంది. అంటే.. అన్ని కోణాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం అని అనుకోవచ్చు. మరి ఈ బజ్ నిజం అయితే.. మళ్ళీ నాని పెద్ద హిట్టు కొట్టేయడం గ్యారెంటీ. 

వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాణం జరుపుకున్న హాయ్ నాని సినిమాకు హీషం అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.  శౌరవ్ దర్శకత్వంలో సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. మరి డిసెంబర్ 7 నుంచి నాని థియేటర్లలో ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాల్సిందే. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు