Vishal: వరుసగా పార్టీలు పెడుతున్న హీరోలు...విజయ్ తర్వాత విశాల్.. తమిళ హీరోలు రాజకీయాల మీద పడ్డారు. మొన్న దళపతి విజయ్ కొత్త పార్టీని పెట్టగా ఇప్పుడు విశాల్ వంతు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని..కొత్త పార్టీతో ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు విశాల్. By Manogna alamuru 15 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Hero Vishal: తమిళనాడు రాజకీయాల్లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే తాను రాజకీయ అరంగేట్రం చేయనున్నాని నటుడు విశాల్ ప్రకటించారు. తొందరలో ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని తెలిపారు. పార్టీ పేరు ఏంటి...ఎప్పుడు పెడతాలాంటి వివరాలను తర్వలోనే ప్రకటిస్తానని చెప్పారు విశాల్. అయితే ఈసారి ఎన్నికల లోపు రావడం కష్టమేనని...కానీ కచ్చితంగా 2026 ఎలక్షన్స్‌లో పోటీ చేస్తానని చెప్పారు. ఇక ఈసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 100 పోలింగ్ జరగాలని విశాల్ కోరారు. అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా ఓటు వేయాలని పిలునిచ్చారు. తమిళనాడు ఆ రెండు పార్టీలదే హవా.. తమిళనాడులో రాజకీయాలు ఇప్పటివరకు రెండు పార్టీలే ప్రధానంగా ముందుకు సాగుతున్నాయి. జాతీయ పార్టీలు కూడా వాటితోనే పెట్టుకుంటున్నాయి. మధ్యలో కమల్ హసన్‌తో సహా చాలా మంది నటులు, ఇతరులు పార్టీలు పెట్టారుకానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. పార్టీ పెట్టడం కొన్ని రోజులు పోయాక దానిని డీఎంకే, అన్నీడీఎంకే పార్టీల్లో లేదా జాతీయ పార్టీల్లో విలీనం చేయడమో జరిగింది. అయితే ఈసారి దళపతి విజయ్ కూడా పార్టీ పెట్టారు. పార్టీ సేరుకూడా అనౌన్స్ చేశారు. సినిమాలు మానేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తానని కూడా ప్రకటించారు. అయితే విజయ్ ఇప్పుడుజరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 2026 ఎలక్షన్స్ కోసం సిద్ధమవుతున్నారు. ఈలోపు పార్టీతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 2026లో ఇద్దరు నటుల మధ్యా పోటీ ఉంటుందా.. ఇప్పుడు విశాల్ కూడా 2026 ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాని చెబుతున్నారు. పార్టీని త్వరలోనే అనౌన్స్ చేసినా పోటీ చేసేది మాత్రం అప్పుడే అని చెబుతున్నారు. దీంతో 2026 ఎన్నికలు ఈ ఇద్దరి నటులు, వారి పార్టీల మధ్యా పోటీగా మారుతుందా అని మాట్లాడుకుంటున్నారు తమిళనాడు వాసులు. ఎవరి పార్టీ ఎంత బంలగా ఉంటుందో చూడాలని చర్చించుకుంటున్నారు. Also Read:Iran : ఇరాన్‌కు మంత్రి జైశంకర్ కాల్..17మంది భారతీయ సిబ్బందితో మాట్లాడ్డానికి అనుమతి.. #tamilnadu #party #hero-vishal #political-entry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి