Khammam : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి RRR.. హీరో వెంకటేష్ కు దగ్గరి బంధువు.. ఎలాగో తెలుసా?

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, హీరో వెంకటేష్ కు బలమైనం బంధుత్వం ఉంది. రఘురాం పెద్ద కొడుకు వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితను పెళ్లిచేసుకున్నాడు. పొంగులేటి కుమార్తెను రఘురాం చిన్న కొడుకు పెళ్లి చేసుకోవడంతో ఈ ముగ్గురికి రిలేషన్ ఏర్పడింది.

New Update
Khammam: వియ్యంకుడి విజయం కోసం.. మే 7న ఖమ్మంలో హీరో వెంకటేష్ ప్రచారం!

Raghuram Reddy : లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో కాంగ్రెస్(Congress) ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు రామసహాయం రఘురాం రెడ్డి(Raghuram Reddy). పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ ఆయన స్వగ్రామం. కాగా ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్(Hyderabad) లో నివాసం ఉంటున్నారు. అయితే రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులుండగా.. వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్(Daggubati Venkatesh) పెద్ద కుమార్తె ఆశ్రితను పెళ్లి చేసుకున్నాడు. చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె సప్నరెడ్డిని వివాహం చేసుకున్నారు. దీంతో ఒకవైపు పొంగులేటి, మరోవైపు సిని హీరో వెంకటేష్ సైతం ఆయన గెలుపుకోసం ప్రచారం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం..
రామసహాయం రఘురాం రెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉండేది. సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ళచెర్వు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలకు, ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్ గా పనిచేశారు.1985లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా, 1989, 1991లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు, వరంగల్ లోక్ సభకు ఇన్ చార్జ్ గా పనిచేశారు.

ఇది కూడా చదవండి: Cancer foods: ‘ఆర్గానిక్’ ఫుడ్ లోనూ క్యాన్సర్ కారకాలు.. మొత్తం 527 ఐటెమ్స్.. షాకింగ్ రిపోర్ట్!

ఉచితంగా స్థలాల కేటాయింపు..
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో రాజ్యసభకు, 2014లో ఎమ్మెల్సీ పదవులకు రఘురాంను నామినేట్ చేయగా చివరి నిమిషంలో అవి వేరే వారిని వరించాయి. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. దీంతో రఘురాం రెడ్డి 2011-2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) ప్యాటరన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ గా,హైదరాబాద్ రేస్ క్లబ్ లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మరిపెడ- బంగ్లా లో ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్న మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్టీసీ బస్టాండ్, పీహెచ్ సీ లు , ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలు, టిటిడి కల్యాణ మండపాలకు దశాబ్దాల కాలం కిందటే ఉచితంగా స్థలాలను కేటాయించారు. వరంగల్ లో రెడ్డి ఉమెన్స్ హాస్టల్ ను నిర్మించారు. అనేక ప్రాంతాల్లో రామాలయాలను, శివాలయాలను, వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. వారి స్వగ్రామమైన కూసుమంచి మండలం చేగొమ్మలో వారి ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఉచితంగా ఇచ్చి ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు