జమ్మూలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి మొత్తం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కంటి మీద కునుకును దూరం చేసింది. చనిపోయిన వారి బంధువులతో పాటూ అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి మరికొందరు స్పందించారు. దాడిలో మృతి చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసుకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
అత్యవసర క్యాబినెట్ సమావేశం..
మరోవైపు ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలో ముగించుకుని తిరిగి వచ్చేశారు. ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి...ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. దాంతో పాటూ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. బైసరన్ లోయలో పర్యాటకుల మీద జరిగిన దాడి గురించి చర్చించనున్నారు. దీంట్లో తదుపరి తీసుకోవాల్సిన చర్యల మీద నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రధాని మోదీ జమ్మూ వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. మరి కాసేపట్లో పహల్గామ్ లో దాడి జరిగిన చోటికి అమిత్ షా వెళ్ళనున్నారు.
today-latest-news-in-telugu | pm-modi | cabinet-meeting | soudi-arebia
Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం