Court Movie: నాని- ప్రియదర్శి 'కోర్ట్' మూవీ.. పూజ సెర్మనీ ఫొటోలు నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'కోర్ట్'. నేడు పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను గ్రాండ్ గా లంచ్ చేశారు. ఈ పూజ కార్యక్రమంలో హీరో నాని, సాయి కుమార్, శివాజీ, నిర్మాత ప్రశాంతి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 30 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Court Movie: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కనున్న లేటెస్ట్ ఫిల్మ్ 'కోర్ట్'. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని నేడు పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, ప్రియదర్శి, సీనియర్ నటుడు సాయి కుమార్, శివాజీ, నిర్మాత ప్రశాంతి పాల్గొన్నారు. సినిమాకు నాని క్లాప్ కొట్టగా.. నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరాఠి బ్లాక్ బస్టర్ హిట్ 'కోర్ట్' మూవీకి రీమేక్ ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపిరినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓ యువకుడిని అన్యాయంగా కేసులో నిందితుడిగా చేసిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. #COURT begins with an auspicious puja ceremony. Shoot begins this September ✨ Natural Star @NameisNani Presents#COURT - 'State vs A Nobody' ⚖️ Motion Poster Out now! ▶️ https://t.co/iQzOOA6nhH Starring @PriyadarshiPN Directed by #RamJagadeesh@ActorSivaji @saikumaractor… pic.twitter.com/4K4Pbqb97E — BA Raju's Team (@baraju_SuperHit) August 30, 2024 పూజ సెర్మనీ ఫొటోస్ Also Read: Ravi Shankar: 'మిస్టరీ వీడబోతుంది'... నటుడు రవిశంకర్ కొత్త సినిమా అప్డేట్! - Rtvlive.com #priyadarshi #court-movie #hero-nani సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి