Mirai : మాంత్రికుడిగా మంచు మనోజ్.. మిరాయ్ నుంచి అదిరిపోయే అప్డేట్

యంగ్ తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మిరాయ్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మిరాయ్ లో విలన్ గా నటిస్తోన్న మంచు మనోజ్ పాత్రను మే 20న రివీల్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Mirai : మాంత్రికుడిగా మంచు మనోజ్.. మిరాయ్ నుంచి అదిరిపోయే అప్డేట్

Mirai Poster Release : హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తేజ చేస్తున్న చిత్రాల్లో మిరాయ్(Mirai) ఒకటి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మిరాయ్ నుంచి విడుదలైన థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది.

మాంత్రికుడిగా మనోజ్

తేజ సజ్జ సూపర్ యోధాగా కనిపిస్తున్న ఈ చిత్రంలో హీరో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా మనోజ్ పాత్రకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మే 20న మిరాయ్ నుంచి మనోజ్ పాత్రను రివీల్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. AAA సినిమాస్ లో నిర్వహించనున్న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో పాత్రను రివీల్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో మనోజ్ మాంత్రికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మిరాయ్ 2025 ఏప్రిల్ 18న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. రితిక నాయక్ కథానాయికగా నటిస్తోంది.

Honeymoon Express : హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి 'క్యూట్‌గా.. స్వీట్‌గా' లిరికల్ సాంగ్ - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు