Chandrayaan-3: ల్యాండింగ్‌ సమయంలో చంద్రుడి ఎలా ఉన్నాడో చూశారా.. మస్ట్ వాచ్‌ వీడియో భయ్యా!

ఇస్రో నుంచి చంద్రయాన్-3 విషయంలో ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ముందు చంద్రుడు ఎలా కనిపించాడో ఓ ఫుటేజీని ఇస్రో ట్విట్టర్‌లో షేర్ చేసింది. మరోవైపు చంద్రుడి దక్షిణ ధృవాన్నే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌. ఆ ప్రాంతం తమ పరిశోధన లక్ష్యాలకు అనుగుణంగా ఉందన్నారు. చంద్రుడిపై మానవుడు నివసించడానికి వీలైన ఆవాస యోగ్య ప్రదేశాలను గుర్తించడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు.

New Update
Chandrayaan-3: ల్యాండింగ్‌ సమయంలో చంద్రుడి ఎలా ఉన్నాడో చూశారా.. మస్ట్ వాచ్‌ వీడియో భయ్యా!

చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ముందు చంద్రుడు ఎలా కనిపించాడో ఓ ఫుటేజీని ఇస్రో ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆనందపడుతున్నారు. ఇస్రో సైంటిస్టులను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.


దేశం మొత్తం చంద్రయాన్‌ జపం:
140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది చంద్రయాన్‌-3. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగిన కొద్ది గంటల తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ బయటకి వచ్చింది. ఇస్రో చేపట్టిన ప్రయోగానికి పరిపూర్ణ విజయాన్ని చేకూరుస్తూ రోవర్‌ ప్రజ్ఞాన్‌..చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టింది. చంద్రుని గుట్టు విప్పడంలో కీలక పాత్ర పోషించే రోవర్‌..తన పని మొదలుపెట్టేసింది. 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అధ్యయనం చేస్తాయి. అక్కడి ఫొటోలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌పై ఇస్రో ట్వీట్‌ చేసింది. చంద్రయాన్ 3 రోవర్ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది. అది ల్యాండర్ నుంచి సాఫీగా బయటకు వచ్చింది. దీంతో భారత్ చంద్రుడిపై నడిచింది' అంటూ ట్వీట్ చేసింది ఇస్రో. మరోవైపు చంద్రుడి దక్షిణ ధృవాన్నే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌. ఆ ప్రాంతం తమ పరిశోధన లక్ష్యాలకు అనుగుణంగా ఉందన్నారు. చంద్రుడిపై మానవుడు నివసించడానికి వీలైన ఆవాస యోగ్య ప్రదేశాలను గుర్తించడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు. సూర్య రశ్మి ప్రభావం తక్కువగా ఉండడం వల్ల నీటి జాడలు, మంచు బిందువుల జాడలు కూడా ఇక్కడే లభించే అవకాశముందని భావించామని..దక్షిణ ధృవాన్ని కేంద్రంగా చేసుకుని చంద్రుడిపై తదుపరి ప్రయోగాలు ఉంటాయని వెల్లడించారు.

సూర్యరశ్మితో పనిచేసే ప్రజ్ఞాన్‌:
ఇక చంద్రుడిపై కాలుమోపిన విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ సూర్యరశ్మితో పనిచేస్తాయి. చంద్రుడిపై పగలు..14 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడిపై చీకటి నెలకొని ఉష్ణోగ్రత మైనస్‌ 180 డిగ్రీలకు పడిపోతుంది. ఆ సమయంలో ల్యాండర్‌, రోవర్‌ మనుగడ కష్టం. ఐతే ఆ 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యోదయం అయ్యాక..విక్రమ్‌, ప్రజ్ఞాన్‌పై సూర్యరశ్మి పడి తిరిగి పనిచేయడం మొదలుపెడితే గొప్ప ప్రయోజనమని ఇస్రో చెబుతోంది. అయితే ప్రగ్యాన్ రోవర్ కేవలం 26 కిలోలు ఉండటంతో అది విక్రమ్ ల్యాండర్‌తో మాత్రమే కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. చంద్రుడిపై తిరుగుతూ రోవర్ సేకరించిన సమాచారాన్ని ల్యాండర్‌కు అందిస్తే..అది అక్కడి నుంచి భూమిపైన బెంగళూరులో ఉన్న ఇస్రో కేంద్రానికి డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్‌ విక్రమ్‌ యాక్టివేట్‌ అయితేనే భూమికి సంకేతాలు చేరతాయి. ఇక ల్యాండర్‌, రోవర్‌లో 5 పేలోడ్స్‌ ఉంటాయి. ల్యాండర్‌లో ఉన్న రాంబా..జాబిల్లిపై అయాన్లు, ఎలక్ట్రాన్‌లో సాంద్రతపై అధ్యయనం చేస్తుంది. చాస్టే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది. ఇక ILSA చంద్రయాన్‌ దిగిన ప్రాంతంలో భూకంపాల తీవ్రతపై ప్రయోగాలు చేస్తుంది. అలాగే జాబిల్లి పొరలు, మట్టి స్వభావాన్ని పరిశీలిస్తుంది. ఇక LRA..చంద్రుడిపై గతి శాస్త్రాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మొత్తం 7సెన్సార్లను ఉంచారు.

ఇక రోవర్‌లో ఉన్న LIBS..గుణాత్మక, నిర్మాణాత్మక మూలాలను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరంలో ఉన్న లేజర్‌ మట్టిపై పడి..ఆ మట్టిని కరిగించి అందులో ఉన్న రసాయన మూలకాలు, ఖనిజ సంపదను గుర్తించడంలో తోడ్పడుతుంది. ఇక APXS ల్యాండింగ్‌ అయిన ప్రదేశంలోని మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తిస్తుంది. ముఖ్యంగా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి మూలకాలను గుర్తించే పనిలో ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు