పులిదాడిలో గాయపడ్డ ఆవు.. పులిని తరిమికొట్టిన గోవులు! ఓ ఫామ్‌లో మందకు కాస్తంత దూరంలో నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడిచేసింది. దీని అరుపులు విన్న ఆవు మందంతా కలిసికట్టుగా అన్నీ వెళ్లి పులిని భయపెట్టాయి. తనపై దాడికి వచ్చిన మందను చూసిన పులి, భయంతో అక్కడి నుంచి పరుగో, పరుగంటూ పరుగులు తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని కేర్వా ప్రాంతంలో జరిగిన ఈ అరుదైన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. By Shareef Pasha 20 Jun 2023 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘటన ఒంటరిగా ఉన్న ఆవుపై పులి దాడి మంద వెళ్లడంతో పులి పరుగో పరుగు ఓ ఫామ్‌లో రాత్రివేళ మందకు కాస్తంత దూరంలో నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడిచేసి మెడ పట్టుకుంది. దీని అరుపులు విన్న మందంతా అటువైపు తిరిగి పులిని చూశాయి. అంతే.. కలిసికట్టుగా అన్నీ వెళ్లి పులిని భయపెట్టాయి. తనపై దాడికి వచ్చిన మందను చూసిన పులి, భయంతో అక్కడి నుంచి పరుగో, పరుగంటూ పరుగులు తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని కేర్వా ప్రాంతంలో రాత్రి జరిగిన ఈ అరుదైన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆవుల మంద దాడి చేయడంతో పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిన పులి తిరిగి దాడిచేసేందుకు సమయం కోసం దాదాపు మూడు గంటలపాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో గాయపడిన ఆవు చుట్టూ చేరిన మిగతా ఆవులు ఆ రాత్రంతా దానికి రక్షణగా నిలిచాయి. ఉదయం గాయపడిన ఆవును చూసిన యజమాని దానిని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం దాని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 76 ఎకరాల్లో ఫామ్ హౌజ్ ఉండగా.. దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. https://twitter.com/ndtv/status/1671007507417022465?cxt=HHwWgoDSibCezrAuAAAA #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి