TS News: తెలంగాణలో ఎండలే ఎండలు..6రోజులు వేడిగాలులు..!!

తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపం షురూ కానుందని వాతావరణ శాఖ తెలిపింది. మండే ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈరోజు నుంచి ఎండ ప్రభావితం ఎక్కువగా ఉండబోతున్నట్లు అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 37డిగ్రీల నుంచి 38డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

New Update
TS News : తెలంగాణ వాసులకు అలెర్ట్...ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!

TS News: మండేకాలం ఎండాలం షురూ అయ్యింది. ఈ ఏడాది ఎండలు భారీగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం మొదలుకానుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మండే ఎండల నుంచి జాగ్రత్తపడే సమయం వచ్చిందంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ఎండ ప్రభావితం ఎక్కువగా ఉండబోతున్నట్లు అంచనా వేసింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట 37డిగ్రీల నుంచి 38డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: రైతన్నలకు గుడ్ న్యూస్…రుణమాఫీపై సర్కార్ కీలక నిర్ణయం..!!

అటు హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే వారం పది రోజుల్లో మండే ఎండలతోపాటు ఎండాకాలం తరహాలోనే వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. చలికాలం పూర్తికాకుండానే ఫిబ్రవరి నెలలోనే వేడిగాలులు వీస్తుండటంతో జనం జంకుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. హైదరాబాద్ లో 36 డిగ్రీల నుంచి 37డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు ఆరు రోజుల మధ్యకాలంలో తెలంగాణ అంతటా బలమైన వేడిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది.


Advertisment
Advertisment
తాజా కథనాలు