TTD: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్.. వర్షాల నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .రోజంతా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Bhavana 04 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి ఏపీ పై మిచౌంగ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, విశాఖలో భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి ఈదురు గాలులు వీస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వాన నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తిరుపతిలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో అత్యవసరం అయితే తప్ప మూడు రోజుల పాటు ప్రజలు బయటికి రావొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. తిరుపతిలో వర్షపు నీరు రోడ్డు పై నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు అధికారులకు అనుమతి నిరాకరించారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు కూడా పర్యాటకులను అనుమతించడం లేదు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారీ వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని వెంటనే తొలగించిన సిబ్బంది. తిరుమల ఘాట్ రోడ్డులో భారీ వర్షాల కారణంగా మినీ జలపాతాలు జాలువారుతున్నాయి. చలితో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. . శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలకళ సంతరించుకుంది. వరదయ్యపాలెం చెరువుకు గండి పడే ప్రమాదం ఉండటంతో అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. Also read: ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కల్లోలం.. లేటెస్ట్ అప్డేట్స్ ఇవే! #tirupati #ttd #cyclone #michaung మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి