Michaung : ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కల్లోలం.. లేటెస్ట్ అప్డేట్స్ ఇవే! మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది.దీని వల్ల ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నంలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. By Bhavana 04 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Latest Updates : బంగాళాఖాతంల ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ (Michaung) ప్రభావం ఏపీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు భారీ వర్షం..గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల ప్రజలకు బయట ఊర్లతో సంబంధాలు తెగిపోయాయి.ఇప్పటికే వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. వర్ష ప్రభావం వచ్చే 48 గంటల వరకు ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. మిచౌంగ్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, కడప, శ్రీసత్య సాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలుపడే అవకాశం ఉంది. బాపట్ల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడుతుందని పేర్కొంది. రైతులు పొలం పనులు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. Also read: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం! #ap #machilipatnam #cyclone #cyclone-michaung #michaung మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి