Hyderabad : వరదలో చిక్కుకున్న కారు... ప్రాణాలకు తెగించి కారులో ఉన్నవారిని కాపాడిన యువకులు!

ముషీరాబాద్ లోని రాంనగర్ లో ఓ వీధిలో వరద ఉదృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

New Update
Hyderabad : వరదలో చిక్కుకున్న కారు... ప్రాణాలకు తెగించి కారులో ఉన్నవారిని కాపాడిన యువకులు!

Heavy Rains Lashes In Hyderabad : హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో ఆదివారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కుండపోతకు నగరంలోని పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే రాంనగర్‌ లో ఓ కారు వరదనీటిలో చిక్కుకుంది. భారీ వర్షానికి (Heavy Rain) కారు నీటిలో మునిగిపోయింది. కారు డోర్లు ఓపెన్‌ కాకపోవడంతో అందులో నలుగురు ప్రయాణికులు చిక్కుకుపోయారు.

స్థానికులు వారి ప్రాణాలకు తెగించి కారులో ఉన్న వారిని కాపాడారు. కారు అద్దాలు పగలగొట్టి కారులోంచి లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. రాంనగర్ స్ట్రీట్ నెంబర్ 17లో ఈ ఘోర ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీగా వరద రావడంతో కారు కొట్టుకుపోయింది. భారీ వర్షం నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తింది.

ముషీరాబాద్ లోని రాంనగర్ లో ఓ వీధిలో వరద ఉద్దృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కారు లోపలే ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. స్థానిక యువకుడు ప్రణీత్ యాదవ్ అతడి స్నేహితులు రిస్క్ చేసి కారును గోడ పక్కకు తీసుకొచ్చారు. అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం…డీసీఎం ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

New Update
jagan-si-sudhakar

Janamala Srinivasa Rao shocking comments on jagan

AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వాలకు భజన చేయాలా..

ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్‌ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment