ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న ఏపీ పర్యాటకులు!

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌ లో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన వేరువేరు ఘటనల్లో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

New Update
ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న ఏపీ పర్యాటకులు!

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌ లో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన వేరువేరు ఘటనల్లో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

రాజధాని డెహ్రాడూన్ తో పాటు హిల్‌ స్టేట్ లోని ఐదు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదిలాఉంటే.. రెండురోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అనేక మంది యాత్రికులు చిక్కుకుపోయారు. రుషికేశ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి.

యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, వేలాది మంది ప్రజలు నిలిచిపోయారు. వీరిలో బెంగళూరు, ఏపీ నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు కూడా ఉన్నారు. వారంతా తిరుగు ప్రయాణంలో చిక్కుకున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా మంగళవారం పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

డెహ్రాడూన్ ప్రాంతంలో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గర్హ్వాల్, కుమావోన్ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలోని గౌరీకుండ్ సమీపంలో వరదలు సంభవించాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment