Rains: వరుసగా 5 రోజులు వానలే వానలు...ఆ ప్రాంతాల్లో జోరుగా పడే ఛాన్స్! హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.రానున్న ఐదు రోజుల పాటు అంటే బుధవారం నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. By Bhavana 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Rains: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ముందుగానే వచ్చాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావవరణశాఖాధికారులు తెలిపారు.దానికి తగినట్లుగానే జూన్ ప్రారంభం నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.రానున్న ఐదు రోజుల పాటు అంటే బుధవారం నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు. అలాగే గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయం, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ కాలం కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడుతున్నాయి. Also read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు #hyderabad #rain #imd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి