Rain Alert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Rain Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారిపోయింది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది.

అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. గత కొంతకాలంగా వేడితో అల్లాడిపోయిన దేశ ప్రజలు.. వాతావరణం చల్లబడడంతో ప్రజలు చల్ల గాలుల నుంచి ఉపశమనం పొందుతున్నారు.

ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో భారీగా వర్షం కురుస్తుంది.

Also read: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి…వచ్చే సారికి మొదలు పెట్టండి…ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

జాక్ ట్విట్టర్ రివ్యూ.. జోకర్‌గా మిగిలిన జాక్

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కథ కూడా పెద్దగా లేదని, కాస్త స్లోగా స్క్రీన్ ప్లే ఉందని టాక్ వినిపిస్తోంది.

New Update
Siddhu Jonnalagadda Jack Movie

Jack

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో స్పై యాక్షన్ పెద్దగా పండలేదు. బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ అసలు కనిపించలేదు. నిజానికి ఈ మూవీలో అసలు కామెడీ పండలేదని టాక్ వినిపిస్తోంది. లవ్ స్టోరీ, ఫ్యామిలీ మూవీల్లో మార్క్ చూపించిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో హిట్ కొట్టలేకపోయినట్లు తెలుస్తోంది. కథ కూడా పెద్దగా లేదని, కాస్త స్లోగా స్క్రీన్ ప్లే ఉందని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ పర్లేదు.. కానీ సెకండాఫ్ మాత్రం కాస్త స్లోగా ఉంటుందట. 

Advertisment
Advertisment
Advertisment