Tirupathi: తిరుపతిలో భారీ వర్షం..ఇబ్బందులు పడుతున్న భక్తులు

దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలో ఈరోజు భారీ వర్షం కురిసింది. దీంతో తిరుపతికి వచ్చిన పర్యాటకులు,యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి వాహనదారులు , పాదచారులు తిరగడానికి పాట్లు డుతున్నారు.

New Update
Tirupathi: తిరుపతిలో భారీ వర్షం..ఇబ్బందులు పడుతున్న భక్తులు

Heavy Rain In Tirupathi: దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో 5.8km మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా చిత్తూరు జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురిస్తే.. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురిసింది. తిరుపతి నగరం తడిసి ముద్దయింది. దీంతో తిరుమలకు వచ్చిన భక్తుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్విచక్ర వాహనదారులు , పాదచారులు, తిరుపతికి వచ్చిన పర్యాటకులు,యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రిపూట కావడంతో దుకాణాలు, షాపులు మూసి ఇండ్లకు వెళ్ళే దుకాణదారులు వ్యాపారస్తులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలకు, తీవ్రఅంతరాయం కలిగింది. ఈ భారీవర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్లోవాహనాల రాకపోకలు నిదానంగా సాగాయి.

Also Read:Cricket: రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా

Advertisment
Advertisment
తాజా కథనాలు