Hyderabad : హైదరాబాద్‌ లో భారీ వర్షం!

ఉదయం వరకు ఉక్కపోతతో అల్లాడిన భాగ్య నగరం వాసులు ఒక్కసారిగా చల్లబడ్డారు. హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం దాదాపు గంటన్నర సేపు పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వాన పడటంతో నగర వాసులకు ఉపశమనం లభించింది.

New Update
Hyderabad : హైదరాబాద్‌ లో భారీ వర్షం!

Heavy Rain : ఉదయం వరకు ఉక్కపోతతో అల్లాడిన భాగ్య నగరం వాసులు ఒక్కసారిగా చల్లబడ్డారు. హైదరాబాద్‌(Hyderabad) నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం(Rain) దాదాపు గంటన్నర సేపు పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వాన పడటంతో నగర వాసులకు ఉపశమనం లభించింది.

ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కొంత ఈరోజు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. ఉదయం నుంచే వాతావరణం(Weather) లో కొంచెం మార్పు వచ్చింది. అయితే వర్షం కురుస్తుందా? లేదా? అని సందేహిస్తున్న తరుణంలో భారీ వర్షం పడింది అనేక ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు జలమయి మయ్యాయి. గత కొద్ది రోజులుగా మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షంతో పాటు చల్లటి గాలులు సేదతీరేలా చేశాయి.

ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ..మెదక్‌ జిల్లాలో దంచికొడుతున్న వాన. భారీ వర్షాలతో తీవ్రస్థాయిలో పంట నష్టం . అకాల వర్షంతో నేల రాలిన వరి, మామిడి కాయలు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. ఈదురుగాలులకు నెలకొరిగిన చెట్లు, విద్యుత్‌కు అంతరాయం
నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో పిడుగు పడి 3 గేదెలు మృతి చెందాయి.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్..అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఎల్బీనగర్‌..మెహదీపట్నం, టోలీచౌకీ, అత్తాపూర్‌లో భారీ వర్షం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుమ్మరించిన వాన . ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నిలిచిన నీళ్లు, పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Also Read : మరో రెండేళ్ళల్లో ఎయిర్ ట్యాక్సీలు

Advertisment
Advertisment
తాజా కథనాలు