Hyderabad: హైదరాబాద్‌ లో భారీ వర్షం...జలమయమైన రహదారులు!

నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షం వల్ల నగరం మునిగిపోయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, పంజాగుట్ట,ఏరియాల్లో వర్షం భారీగా పడింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షం వల్ల నగరం మునిగిపోయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, యూసుఫ్‌గూడ, అమీర్పేట, ఫిల్మ్‌ నగర్‌, కూకట్‌పల్లి, నాంపల్లి తదితర ఏరియాల్లో వర్షం భారీగా పడింది.

భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కావటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పిడింది. పంజాగుట్ట వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. ఇక పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ఇక బుధవారమే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన విషయం తెలిసిందే.

వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులు వీస్తాయన్నారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు వెళ్లాలని.. పిడుగులు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also read: ప్రధాని మోదీతో పవన్ ఫ్యామిలీ భేటీ

Advertisment
Advertisment
తాజా కథనాలు