ముంచెత్తిన భారీ వర్షం..విద్యా సంస్థలకు సెలవు!

చెన్నైతో పాటు పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో చెన్నైలోని ప్రధాన రహదారులన్ని కూడా మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

New Update
ముంచెత్తిన భారీ వర్షం..విద్యా సంస్థలకు సెలవు!

తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. రాజధాని నగరం చెన్నైతో పాటు పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో చెన్నైలోని ప్రధాన రహదారులన్ని కూడా మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

పలు కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో శనివారం ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దీంతో ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లోనూ చెన్నైలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మరో వైపు భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని విద్యాసంస్థలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్‌ బాలచంద్రన్‌ తెలిపారు.

అదే విధంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ లలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు.

Also read: దీపావళికి ప్రత్యేక రైళ్లు..అనౌన్స్ చేసిన రైల్వే శాఖ!

Also read: నా కోరిక ఎప్పుడు తీరుతుందో అంటున్న త్రిష!

Advertisment
Advertisment
తాజా కథనాలు