Heat Wave : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో కూడా హీట్‌ వేవ్‌ హెచ్చరికలు!

దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. జనాలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.

New Update
Telangana : తెలంగాణలో మళ్లీ 45 డిగ్రీలకు చేరిన ఎండలు.. ఇవే చివరివి!

Heat Wave Alert : దేశ వ్యాప్తంగా ఎండలు(Sun) మండుతున్నాయి. ఉదయం 7 నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. జనాలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ(Central Meteorological Department) పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్(Heat Wave) హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 23 వరకు పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ(IMD) పేర్కొంది.

ఏప్రిల్ 20-21 మధ్య ఒడిశా, 20-23 మధ్య జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, బీహార్‌ రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 20న ఒడిశా, 20-22 మధ్య గంగా పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, యానాం, కేరళ, మాహే, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఏప్రిల్ 20-23 మధ్య వేడిగాలులతో పాటు తేమతో కూడిన వాతావరణాన్ని ఉండొచ్చని సూచించింది.

ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే శుక్రవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో పలుచోట్లు భారీ వర్షాలు కురిశాయి. పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని రాజ్‌పురా నగరంలో భారీ వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయి. అలాగే జలంధర్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, వడగళ్ల వానలు కురిశాయి.

Also read: పెన్షన్‌ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చి అడ్డంగా బుక్కైంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు