Hyderabad: ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపుపై హైకోర్టు కీలక నిర్ణయం.. నవంబర్ 20 నుంచి..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన నేపథ్యంలో నెలకొన్న ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదానికి సంబంధించి పిటిషన్లపై నవంబర్ 20వ తేదీ నుంచి రోజూ విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

New Update
High Court : శంషాబాద్‌లోని 181 ఎకరాలు హెచ్‌ఎండీఏవి.. హైకోర్టు తీర్పు

Telangana: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన నేపథ్యంలో నెలకొన్న ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదానికి సంబంధించి పిటిషన్లపై నవంబర్ 20వ తేదీ నుంచి రోజూ విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌తో సహా 12 మంది ఆలిండియా సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించిన వివాదంపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వ్యక్తిగత ఇబ్బందులకు సంబంధించి అధికారులు తాజాగా కేంద్రానికి వినతిపత్రాలు సమర్పిస్తే, వాటిని కేంద్రం సానుకూలంగా ఎందుకు పరిశీలించకూడదని వ్యాఖ్యానించింది.

అధికారుల కేటాయింపునకు సంబంధించి ప్రత్యూష్‌ కుమార్‌ సిన్హా కమిటీ సిఫారసులు చెల్లవంటూ 2017 సంవత్సరంలో క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం హైకోర్టులో సవాల్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ.. సోమేశ్ కుమార్ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు డీజీపీ, ఇతర అధికారులకూ వర్తిస్తుందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా 637 ఆలిండియా అధికారుల కేటాయింపు జరగ్గా, ఇందులో 16 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు క్యాట్‌లో సవాల్‌ చేసి ఉత్తర్వులు పొందిన విషయం తెలిసిందే.

అయితే, క్యాట్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని కేంద్ర వాదిస్తోంది. అధికారుల కేటాయింపు నిమిత్తం ప్రత్యూష్ కుమార్ సిన్హా కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను హైకోర్టు సైతం సమర్థించిందని గుర్తు చేశారు అదనపు సొలిసిటర్ జనరల్. ఈ అంశంలో డీజీపీ అంజనీకుమార్ సహా ఐదుగురు ఐపీఎస్ అధికారులుండగా.. వీరిలో ఇద్దరు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, ముగ్గురివి మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఐఏఎస్ అధికారుల విషయంలో 11 మంది ఐఏఎస్‌ అధికారుల్లో సోమేష్ కుమార్ కేసు పరిష్కారమైందని తెలిపారు. ఇక అనంతరాములు, ఎస్ఎస్ రావత్‌లను ఏపీకి కేటాయిచంగా.. క్యాట్ తెలంగాణకు కేటాయించాలంటూ తీర్పు వెలువరించిందని, అయితే, వారు ఇప్పటికీ ఏపీలోనే పని చేస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. ఇలా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లన్నింటిపైనా ఈ నెల 20వ తేదీ నుంచి రోజూ మధ్యాహ్నం విచారణ చేపడతామని పేర్కొంది.

Also Read:

మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు..

ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు