Health Tips: మీ శరీరంలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే పొరపాటున కూడా విస్మరించకండి.. జీవితాంతం చింతించాల్సి వస్తుంది..! నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల ఊబకాయం, స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా కీళ్ల నొప్పుల సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటితో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా శరీరంలో 4 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయి వైద్యులను సంప్రదించాలి. By Shiva.K 24 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Rheumatoid Arthritis Symptoms: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఈటింగ్ డిజార్డర్స్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులలో మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధానమైనవని చెప్పవచ్చు. వీటిలో ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. చాలా మంది కీళ్లనొప్పులతో సతమతం అవుతుంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా కీళ్ల నొప్పులకు సంబంధించినదే. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీని కారణంగా మన కీళ్లు దెబ్బతింటాయి. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. రోగి తన జీవితమంతా అనేక సమస్యలతో బాధపడతాడు. అయితే ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం ద్వారా వ్యాధి తీవ్రతరం కాకుండా నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అందుకే.. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఓసారి తెలుసుకుందాం.. విపరీతమైన అలసట.. అధికంగా పని చేయడం వలన అలసిపోవడం సహజమే. కానీ, చిన్న చిన్న పనులు చేసినా అలసిపోవడం అనేది అనేక వ్యాధులకు సంకేతం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా రోజుల పాటు అలసిపోయినట్లుగా, బలహీనంగా ఉన్నట్లయితే.. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. కీళ్ల వాపు.. కీళ్లలో వాపు, ఎరుపుగా అనిపించడం ఆర్థరైటిస్ ప్రధాన సంకేతం. ఎటువంటి గాయం లేకుండా, ఎటువంటి కారణం లేకుండానే వాపు, ఎరుపును కలిగి ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. Also Read:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా? ఎముక నిర్మాణంలో మార్పులు.. శరీరంలో ఏదైనా కీలు ఆకారం లేదా పరిమాణంలో మార్పు కూడా ఈ తీవ్రమైన వ్యాధికి కారణం. ఎముకలలో గడ్డలు కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణం కావచ్చు. అందుకే.. ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించవద్దు. ఆకలి వేయకపోవడం.. ఆకలి అనిపించకపోవడం కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణం కావొచ్చు. అయితే, ఈ లక్షణం సాధారణంగా కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా కావొచ్చు. ఒకవేళ మీకు ఎముకలు, కీళ్లలో నొప్పి, వాపు అనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. Also Read:చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి #health-tips #health-news #rheumatoid-arthritis-symptoms మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి