Anxiety: ఎంగ్జైటీని లైట్‌ తీసుకోవద్దు.. కారణం ఇదే!

ఎంగ్జైటీని లైట్‌ తీసుకోకూడదు. సంబంధిత డాక్టర్‌ని సంప్రదించాలి. డ్రగ్స్‌ లేదా ఆల్కహాల్ అబ్యూజ్‌ ఎంగ్జైటీ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా ఎంగ్జైటీతో ముడిపడి ఉండవచ్చు.

New Update
Anxiety: ఎంగ్జైటీని లైట్‌ తీసుకోవద్దు.. కారణం ఇదే!

Health Tips : ఎంగ్జైటీ.. చాలా మందిని వేధిస్తోన్న సమస్య ఇది. ఎంగ్జైటీ తీవ్రమైతే అనేక సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఇది డిప్రెషన్‌కు కూడా దారి తీస్తుంది. ఎంగ్జైటీ డిజార్డర్‌ అంటే ఇది మానసిక రుగ్మతల సమూహం. ఇది ఆందోళన, భయం లాంటి భావాలను కలిగి ఉంటుంది. ఎంగ్జైటీతో చిరాకు, అలసట, ఏకాగ్రతలో ఇబ్బంది, హార్ట్‌బీట్‌ రేట్‌ పెరగడం, ఛాతీ నొప్పి, కడుపు నొప్పి లాంటి సమస్యలు ఉంటాయి. కొంతమందిలో ఇతర సమస్యలు కూడా ఉండొచ్చు. ఎంగ్జైటీని అసలు లైట్‌ తీసుకోకూడదు.

ఎంగ్జైటీ బారిన పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యుశాస్త్రం ప్రకారం ఈ ఆందోళన రుగ్మతలు కుటుంబ చరిత్ర నుంచి కూడా వస్తుంది. అంటే మన కుటుంబంలో ఎవరికైనా ఈ ప్రాబ్లెమ్‌ ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సెరోటోనిన్, డోపమైన్ లాంటి న్యూరోట్రాన్స్మిటర్లలో అసమతుల్యత ఈ డిజార్డర్‌కు దోహదం చేస్తుంది. కొన్ని స్వభావాలు లేదా అభిజ్ఞా శైలులు కలిగిన వ్యక్తులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పాతగాయాలు:
గతంలో జరిగిన పర్శనల్‌ లైఫ్‌ గాయాలు లేదా ముఖ్యమైన జీవిత సంఘటనలు లాంటి గత బాధాకరమైన అనుభవాలు ఆందోళనను రేకెత్తిస్తాయి. ఒత్తిడితో కూడిన జీవిత సంఘటనలు కూడా ఎంగ్జైటీకి కారణం అవుతాయి. ప్రధాన జీవిత మార్పులు, పని ఒత్తిళ్లు లేదా సంబంధ సమస్యలు ఆందోళనను ప్రేరేపిస్తాయి. థైరాయిడ్ రుగ్మతలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు లాంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ఆందోళనతో ముడిపడి ఉండవచ్చు. డ్రగ్ లేదా ఆల్కహాల్ దుర్వినియోగం ఆందోళన లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు లేదా ప్రేరేపించవచ్చు. అటు ఫోబియాస్‌ కూడా ఎంగ్జైటీకి రీజర్‌ కావొచ్చు. నిర్దిష్ట వస్తువులు లేదా పరిస్థితుల పట్ల తీవ్రమైన భయాలు ఆందోళనకు దారితీస్తాయి. మెదడు నిర్మాణం లేదా పనితీరులో మార్పులు ఆందోళన రుగ్మతలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఏదిఏమైనా ఎంగ్జైటీని లైట్‌ తీసుకోకుండా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం.

Also Read: ఆస్ట్రేలియా టీమ్‌ సెలబ్రేషన్‌.. ఆ వీడియో ఫేక్.. అసల మేటరిదే! 

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు