Guavas Benefits: జామకాయను ఈ సమయంలో తింటే 5 అద్భుత ప్రయోజనాలు.. జామకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే, జామపండ్లతో అందంతో పాటు.. మరో 5 ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందాన్ని పెంచుతుంది. By Shiva.K 29 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి 5 Benefits of Guavas: శీతాకాలంలో అందుబాటులో ఉండే పండ్లలో జామకాయ కూడా ఒకటి. ఈ కాలంలో జామకాయం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జామ పండును తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఐదు బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మని ఆ బెనిఫిట్స్ ఏంటో ఓసారి చూద్దాం.. 1. జీర్ణక్రియ: జామపండ్లు ముఖ్యంగా కడుపు, జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అధిక ఫైబర్ కంటెంట్.. మలబద్ధకాన్ని తగ్గించడంలో, ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను ప్రోత్సహించడంతో పాటు.. ఆరోగ్యకరమైన ప్రేగులను నిర్వహించడానికి తోడ్పాటునందిస్తుంది. 2. బరువు నిర్వహణ: జామ పండ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గించడంలో ఇవి అద్భుతంగా సహకరిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల అవాంఛిత బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. క్యాలరీల గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకునేవారు.. స్నాక్స్‌గా జామ పండ్లను తినడం ఉత్తమం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 3. చర్మ కాంతి: జామ పండ్లు చర్మ ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. అందాన్ని పెంచుతాయి. ముఖ్యంగా గులాబీ రంగు జామపండ్లు చర్మకాంతిని పెంచుతాయి. జామ, గుడ్డులోని పచ్చసొనతో స్క్రబ్‌ని తయారు చేసి.. ముఖానికి 20 నిమిషాల పాటు అప్లై చేస్తే కాంతివంతమైన ఛాయ వస్తుంది. జామపండ్లలో విటమిన్ ఇ ఉండటం వల్ల చర్మానికి పోషణ అందించి, స్కర్వీ వంటి పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 4. క్యాన్సర్ నిరోధక లక్షణాలు: జామ ఆకులోని సారం క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. జామ ఆకుల రసం వల్ల క్యాన్సర్ కణాల వృద్ధి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 5. సరైన సమయం: జామ పండ్ల ప్రయోజనాలను సంపూర్ణంగా అందిపుచ్చుకోవాలంటే.. మధ్యాహ్నం సమయంలో తినడం మంచిది. మధ్యాహ్న భోజనంలో గంటన్నర తర్వాత జామపండ్లు తినడం వల్ల శరీరం సహజమైన జీర్ణక్రియ లయలకు అనుగుణంగా పేగు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. Also Read: మరో అమ్మాయిని చూశాడని ఆగ్రహించిన ప్రేయసి.. ప్రియుడి కళ్లను పొడిచి కారులో.. మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే.. టెన్షన్ పడకుండా ఇలా చేయండి! #health-tips #health-news #5-benefits-of-guavas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి