Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? వివరాలు మీకోసం..

గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. మరి రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం రోజుకు రెండు గుడ్ల వరకు తినొచ్చని చెబుతన్నారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

New Update
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? వివరాలు మీకోసం..

Eggs for Good Health: 'రోజుకు ఒక గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్' అనే క్యాప్షన్‌ని మనం చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉంటాం. అయితే, మరి నిజాంగానే ఆరోగ్యానికి రోజుకు ఒక గుడ్డు సరిపోతుందా? ఒకటికి మించి గుడ్డు తింటే ఏమవుతుంది. అసలు ఇంతకీ రోజుకు ఎన్ని గుడ్ల వరకు తినొచ్చు? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి తెలుసుకుందాం.. గుడ్లలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), విటమిన్ బి12, విటమిన్ డి, సెలీనియం, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

publive-image

గుడ్డులో పెద్ద పరిమాణంలో కోలిన్, ఐరన్, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇది శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. గుడ్లు కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటాయి. ఈ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే, పరిమితికి మించి తింటే.. ఆరోగ్యానికి హానీ కలిగిస్తుంది. అలాగని.. భయపడి గుడ్డు తినడం మానేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

publive-image

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయం తెలిసిందే. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అదొక్కటే.. శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. అయితే, కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యకరమైనది, మరొకటి అనారోగ్యకరమైనది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఆరోగ్యకరమైన కణజాలాలను కలిగి ఉంటుంది. ఇది.. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. శరీరంలో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు సమస్య ఏర్పడుతుంది. LDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

publive-image

శరీరంలో అధిక స్థాయి LDL కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. HDL కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో HDL కొలెస్ట్రాల్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

publive-image

గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కానీ అవి ఆరోగ్యానికి హానికరం కాదు. ఇవి ఇతర ఆహార పదార్థాల్లో ఉండే కొలెస్ట్రాల్‌కి చాలా భిన్నంగా ఉంటాయి. ఒక పెద్ద గుడ్డులో 186 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది మొత్తం పచ్చసొనలో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తంది. అందుకే.. రోజూ గుడ్డు మొత్తం తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

publive-image

'ది కొరియన్ జర్నల్ ఫుడ్ సైన్స్ ఆఫ్ యానిమల్ రిసోర్సెస్'లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. వారానికి 2-7 గుడ్లు తినడం వల్ల అధిక హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంతో పాటు.. మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే రోజూ 2 గుడ్లు తినడం వల్ల మీ శరీరానికి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:

స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ సీఐడీ అఫిడవిట్..

పాలమూరు బరిలో కోటీశ్వరులు.. ఎవరి ఆస్తులు ఎంతంటే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు