Guava Leaves Tea : శీతాకాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆకుల టీతో చెక్‌ పెట్టొచ్చు తెలుసా!

శీతాకాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అయినటువంటి జలుబు, దగ్గు, అజీర్ణం వంటి సమస్యలకు జామ ఆకుల టీ తో చెక్‌ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని వివరిస్తున్నారు.

New Update
Guava Leaves Tea : శీతాకాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆకుల టీతో చెక్‌ పెట్టొచ్చు తెలుసా!

Winter Season : శీతాకాలం(Winter) వచ్చేసింది. తనతో పాటు ఎన్నో రకాల రోగాలను(Health Issues) కూడా వెంటపెట్టుకుని తీసుకుని వచ్చేసింది. అసలు చలికాలం మొదలైంది అంటేనే జలుబు(Cold) , దగ్గు(Cough) ఇలా రకరకాల అనారోగ్య సమస్యలతో మనం సతమతం అవుతుంటాం. అందుకే చలికాలం మొదలు అయినప్పటి నుంచి కూడా తినే ఆహారం విషయం లో కానీ, ఆరోగ్యం విషయం లో కానీ అనేక విషయాల్లో మనం అప్రమత్తంగా ఉండాలి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదోక సమస్య మనల్ని వేధిస్తూనే ఉంటుంది. అందుకే ఈ కాలంలోనే కాకుండా అన్ని కాలాల్లో కూడా వేడి పదార్థాలను తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఈ కాలంలో ముఖ్యంగా జామాకు టీ(Guava Leaves Tea) తీసుకోవడం వల్ల శీతాకాలంలో వచ్చే అనేక వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

ప్రతి రోజూ ఉదయాన్నే ఈ టీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది. జామాకులలో ఉండే విటమిన్‌ సి అధిక స్థాయిలో ఉంటుంది. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం తో పాటు శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్‌ లతో పోరాడటానికి ఇందులో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

దీనిని నిత్యం తీసుకోవడం వల్ల ఈ కాలంలో ఏర్పడే గొంతు మంట తగ్గడంతో పాటు ఈ కాలంలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలైనటువంటి దగ్గు, జలుబు సమస్యలు పూర్తిగా తగ్గుతాయని నిపుణులు వివరిస్తున్నారు. అంతేకాకుండా చలికాలంలో అందరూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్య అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు బాధపెడుతుంటాయి.

జామాకుల్లో యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్‌ కూడా కంట్రోల్‌ అవుతుందని చెప్పవచ్చు. విటమిన్‌ సి అధికంగా ఉండడం వల్ల చర్మ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి.

Also read: చలికాలంలో మీ రిఫ్రిజిరేటర్ సేఫ్ గా ఉండాలంటే.. ఈ టెంపరేచర్లో ఉంచండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు