Health Tips: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఆరోగ్యానికి సంబంధించి వంటింటి నివారణల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది మన వంటశాలలో లభించే మసాలా దినుసు. దాల్చిన చెక్క కేవలం సువాసన కారకంగానే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. By Shiva.K 26 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Tips: ఉదయాన్నే కెఫీన్‌ను తగ్గించి ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని అందించే న్యూస్. పెద్దగా కష్టపడే పని లేదు.. ఖర్చు చేసే పనీ లేదు. ఇంట్లో మనం నిత్యం వినియోగించే వంటింటి వస్తువుతోనే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఆరోగ్యానికి సంబంధించి వంటింటి నివారణల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది మన వంటశాలలో లభించే మసాలా దినుసు. దాల్చిన చెక్క కేవలం సువాసన కారకంగానే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇదికూడా చదవండి: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం.. దాల్చిన చెక్క నీటి ఆరోగ్య ప్రయోజనాలు.. 1: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. 2: జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది: ఇది జీర్ణశక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 3: మెరుగైన జీవక్రియ, బరువు తగ్గడం - అదనపు బరువు తగ్గించుకోవాలని భావిస్తున్నట్లయితే.. మీ శరీరాన్ని టోన్ చేయడానికి ఇది ఉత్తమమైన, ఆరోగ్యకరమైన మార్గం. దాల్చినచెక్క మీ శరీరం రోజంతా కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది. 4: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ - దాల్చినచెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి, ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. 5: కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహిస్తుంది - దాల్చిన చెక్క ట్రైగ్లిజరైడ్, LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. స్థిరమైన గ్లూకోజ్ స్థాయిలకు మద్దతు ఇస్తుంది. ఇది ధమనులను నిరోధించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దాల్చిన చెక్క నీటిని ఎలా తయారు చేయాలి.. ఒక పాన్ తీసుకొని ఒక కప్పు నీరు పోయాలి. అందులో కొంత దాల్చిన చెక్క వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. ఒక కప్పులో ఆ నీటిని వడకట్టాలి. రుచి కోసం ఇందులో తేనె, నిమ్మరసం కూడా కలపవచ్చు. అయితే, చక్కెర మాత్రం వేయకుండా ఉండండి. ఇక ఈ నీటిని గాజు సీసాలో రెండు రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ఇదికూడా చదవండి: వాసివాడి తస్సాదియ్యా.. పొలిటికల్ పార్టీల పెండ్లి.. శుభలేఖ చూస్తే అవాక్కవ్వాల్సిందే..! #health-tips #health-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి