Amla: ఉసిరి జ్యూస్ తో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. ఇవి తెలిస్తే తాగకుండా ఉండలేరు ఉసిరి జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. పేగు అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విషాన్ని తొలగిస్తుంది. షుగర్ ఉన్నవారు చలి కాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జ్యూస్. By srinivas 07 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాయల్లో ఉసిరి ఒకటి. 'సీ' విటమిన్ పుష్కలంగా కలిగివుండే ఉసిరిని ఆయుర్వేదంలో ఒక వరంగా, భారతీయులు గొప్ప అమృతంగా భావిస్తారు. అంతేకాదు ఆయుర్వేదం ప్రకారం ఉసిరిని 'ఇండియన్ గూస్ బెర్రీ' అని కూడా పిలుస్తారు. విటమిన్ సి, బి కాంప్లెక్స్, పాలీ ఫెనాల్స్, ఐరన్, జింక్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు కలిగివుండే దీని రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల 12కు పైగా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇటీవల 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్' ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉసిరిలో శక్తికవంతమైన యాంటి ఇన్ ఫ్లామేటరీ అండ్ యాంటి బాక్టీరియల్ లక్షణాలున్నాయని తెలిపింది. కాలానుగుణంగా ఫ్లూ, తదితర ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయ పడే ఉసిరిని మీ రెగ్యూలర్ డైట్ లో చేర్చాల్చిన సూపర్ ఫుడ్ గా పేర్కొంది. కాబట్టి ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇంట్లో ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 1. పుష్కలమైన విటమిన్ 'సి' విటమిన్ 'సి'తో నిండి ఉండే ఉసిరి రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఖాలీ కడుపుతో తాగడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. అలాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన బాడీలోని ఇన్ఫెక్షన్‌లతో పోరాడటంతోపాటు మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాయనడంలో సందేహం లేదు. 2. నొప్పి నివారణ గుణాలు: ఉసిరిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉసిరి రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల వాపులు తగ్గుతాయి. 3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: జీర్ణక్రియను కాపాడటంలో ఈ ఉసిరి రసం ఎంతో ఉత్తమమైనది. అజీర్ణం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దూరంచేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరిచే విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉన్నందున దీనిని ఖాళీ కడుపుతో తాగడం చాలా మంచిది. అలాగే ఇది అధిక బరువును తగ్గించి బాడీలో ఫ్యాట్ పెరగకుండా నియంత్రిస్తుంది. అంతేకాదు పేగులకు అంటువ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తుంది. 4. బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది: డయాబెటిస్‌తో బాధపడే వాళ్లకు ఇది చక్కటి ఔషధం. మధుమేహం ఉన్న వ్యక్తుల్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా సమతుల్యం చేయడంలో ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు చలి కాలంలో తప్పనిసరిగా దీనిని తీసుకుంటే సుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. 5. గుండెకు పనితీరు పెంపొందిస్తుంది: ఈ ఆమ్లా జ్యూస్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమేకాదు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ అండ్ పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుండెను పదిలంగా ఉంచడంతోపాటు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. 6. శరీరంలో పేరుకుపోయిన విషాన్ని తొలగిస్తుంది: మత్తు పదార్థాల వల్ల కలిగే ప్రమాదంనుంచి శరీరాన్ని కాపాడుతుంది. బాడీలోని టాక్సిన్స్‌ను వివిధ రూపాల్లో బయటకు పంపించేసి దేహంలోని శక్తి సామార్థ్యాలను పెంపొందిస్తూ మనల్ని ఉత్తేజపరుస్తుంది. 7. చర్మవ్యాధులనుంచి రక్షణ: కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాల పదార్థాల్లో ఆమ్లా జ్యూస్ ఒకటి. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి.. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే (UV Rays) అతినీలలోహిత వికిరణాలు నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడుతూ చర్మం ఆకృతి, నిర్మాణం, మృదుత్వాన్ని పెంచుతుంది. మీ చర్మానికి యవ్వనాన్ని అందిస్తుంది. 8. జుట్టు పెరుగుదల: అందమైన జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఉసిరిని వాడడం వల్ల జుట్టు ఫాలికల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కురులు హెల్దీగా, పొడవుగా పెరుగడంతోపాటు ఊడిపోవడం తగ్గుతుంది. 9. నిరోధక శక్తి పెంచుతుంది: ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను కాపాడుతూ మరింత శక్తిని అందిస్తుంది. ప్రతిరోజు ఈ జ్యూస్ తాగడం వల్ల బాడీలోని ఇన్ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ అనారోగ్యాల భారిన పడకుండా మిమ్మల్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది. 10. ఒత్తిడినుంచి ఉపశమనం: అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగివుంటే ఈ ఆమ్లా ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసికంగానూ మనల్నీ ఉత్తేజపరడంలో హెల్ప్ అవుతుంది. ఉసిరిలో ఉండే ఫైటోన్యూట్రియంట్లు మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అదనంగా, యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని పదును పెడుతుంది. శరీరంలో ఒత్తిడి తగ్గించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 11. కంటి చూపుకు అద్భుతమైన ఔషధం: 'ఎ' విటమిన్‌ను కూడా కలిగివుండే ఈ ఉసిరి కంటి చూపుకు చాలా మేలుచేస్తుంది. ఇప్పటికే దృష్టి లోపంతో బాధపడతున్నవారి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు ఈ జ్యూస్ తాగితే కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు వయసు రిత్యా ఏర్పడే తెల్ల మచ్చలు, కంటిశుక్లం ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇంట్లో ఉసిరి రసం ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటి? - 5-6 ఉసిరికాయలు - అల్లం - తేనె - నీరు తయారీ విధానం: మొదట ఉసిరికాయను బాగా కడిగి, గింజలను తీసివేసి చిన్న ముక్కలుగా కోయండి. ఇప్పుడు మరోసారి ఉసిరి ముక్కలను శుభ్రమైన నీటిలో కడిగి మిక్సీలో వేయండి. అల్లం, తేనె (మీ అభిరుచికి అనుగుణంగా) వేసి మరోసారి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఉసిరి గుజ్జు, సీడ్స్ గ్లాసులోకి రాకుండా జాలితో వడకట్టండి. చివరగా ఒక గ్లాసులో 2 ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసి త్రాగండి. ఇంట్లో ఉసిరి రసాన్ని తయారు చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. గమనిక: జలుబు, దగ్గు, కిడ్నీ పేషెంట్స్, లో బీపీ, లో షుగర్ లెవెల్స్, లివర్ డిసీజ్‌తో బాధపడేవారు వైద్యుల సూచనల మేరకు దీనిని సేవించాలి. #amla-juice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి