Green Tea : భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే.. ఏమవుతుందో తెలుసా సాధారణంగా ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే దీన్ని భోజనం తర్వాత తాగితే కూడా మంచి లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. వీటిలోని పోషకాలు మెరుగైన జీర్ణక్రియ, ఓరల్ హెల్త్ కు సహాయపడతాయి. అలాగే థియనైన్ కాంపౌండ్స్ మంచి నిద్రను అందిస్తాయి. By Archana 13 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Green Tea Benefits : ఈ మధ్య కాలం చాలా మంది వారి రోజూ డైట్ లో గ్రీన్ టీ(Green Tea) నీ ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు. గ్రీన్ టీతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ A, C, E, B(Vitamin A,C,E,B) కాంప్లెక్స్ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒత్తిడి, శరీరంలో అధిక కొలెస్ట్రాల్, బరువు(Weight), రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే గ్రీన్ టీ భోజనం తర్వాత తాగితే కూడా ఆరోగ్యానికి చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు మంచి నిద్ర కొంత మంది రాత్రి సమయాల్లో నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారికి భోజనం తర్వాత గ్రీన్ టీ తీసుకోవడం సరైన ఎంపిక. ఇది నాణ్యమైన మంచి నిద్ర(Good Sleep) ను అందిస్తుంది. గ్రీన్ టీలోని థియనైన్ కాంపౌండ్స్ మంచి నిద్రకు సహాయపడతాయి. అలాగే మెదడును కూడా ప్రశాంతంగా చేస్తుంది. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే ఒత్తిడి, నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. కానీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి కాదు. నోటి శుభ్రతకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ నోట్లో క్రిములను దూరం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకున్న తర్వాత నోట్లో బ్యాక్తీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకని తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే మంచి ప్రభావం ఉంటుంది. అలాగే ఇది పీరియాంటల్ ఇన్ఫ్లమేషన్, టూత్ డీకే , క్యావిటీస్ వంటి దంత సమస్యలను దూరంగా ఉంచుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరుచును భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే జీవక్రియ మరింత వేగంగా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ(Digestion) మెరుగ్గా జరుగుతుంది. అలాగే శరీరంలో కొవ్వులను తగ్గించడానికి సహాయపడుతుంది. Also Read : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే #health-benefits #vitamins #good-sleep #green-tea-benefits-after-meals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి