Viral: ముద్దు పెడితేనే అటెండెన్స్.. లేడీ టీచర్లతో హెడ్‌మాస్టర్ చిల్లర వేషాలు.!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ముద్దు పెడితేనే లేడీ టీచర్లకు హెడ్‌మాస్టర్ అటెండెన్స్ వేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెడ్‌మాస్టర్ నిర్వాకాన్ని ఓ లేడీ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు హెడ్‌మాస్టర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

New Update
Viral:  ముద్దు పెడితేనే అటెండెన్స్.. లేడీ టీచర్లతో హెడ్‌మాస్టర్ చిల్లర వేషాలు.!

Uttar Pradesh Teacher: యూపీలో జులై 8 నుంచి టీచర్ల అటెండెన్స్ కోసం డిజిటల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఈ డిజిటల్ అటెండెన్స్‌పై ఇప్పటికే టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ డిజిటల్ వ్యవస్థను అవకాశంగా తీసుకుని ఓ హెడ్‌మాస్టర్.. లేడీ టీచర్లతో చిల్లరగా వ్యవహరించడం కలకలం రేపుతుంది.

Also Read: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటా.. మా మధ్య ఉన్నది అదే.. క్లారిటీ ఇచ్చిన దివ్వల మాధురి

ఎంతో బాధ్యతగా మెలగాల్సిన హెడ్‌మాస్టర్.. లేడీ టీచర్ల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ముద్దు పెడితేనే అటెండెన్స్ వేస్తా అంటూ లేడీ టీచర్లతో మిస్ బిహేవ్ చేయసాగాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హెడ్‌మాస్టర్ నిర్వాకాన్ని ఓ లేడీ టీచర్ వీడియో తీసింది. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హెడ్‌మాస్టర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Also Read: పెళ్లి పేరుతో మహిళల మోసం.. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి..

ఆ వీడియోలో హెడ్‌మాస్టర్ చిల్లర వేషాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ముద్దు పెట్టే కండిషన్‌కు ఒప్పుకుంటే..టీచర్ వచ్చినా రాకున్నా హజరు వేస్తానంటున్నారు కిచక హెడ్‌మాస్టర్. ముద్దు పెడితేనే లేడీ టీచర్లకు అటెండెన్స్ వేస్తాడు. లేదంటే లేదు. అయితే, హెడ్‌మాస్టర్ నిర్వాకాన్ని ఓ లేడీ టీచర్ వీడియో తీసి బట్టబయలు చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు