Cars Gift: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. అందరికీ కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా! దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు 'టాటా పంచ్ కారు'ను బహుమతిగా ఇచ్చిన వార్త వైరల్‌గా మారింది. హర్యానాలోని పంచకులలోని మిట్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను అందించాడు. ఈ గిఫ్ట్ తీసుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు. By Trinath 03 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మన శ్రమకు తగిన ప్రతిఫలం కచ్చితంగా అనుభవిస్తాం. ఒక సంవత్సరం ఆలస్యం కావొచ్చు.. రెండేళ్లు కావొచ్చు.. లేకుంటే 10, 20ఏళ్లు పట్టచ్చు.. కానీ పడిన కష్టం ఎక్కడికి పోదు. ఏదో ఒక రూపంలో తిరిగి వచ్చేస్తుంది.. ఆనందాన్ని తీసుకొస్తుంది.. బహుమతులను అందజేస్తుంది. కంపెనీలకు లాయల్‌గా ఉండే ఉద్యోగస్తులు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా అరుదుగా కనిపిస్తారు. వారి కష్టాన్ని కంపెనీ గుర్తిస్తే అంతకుమించిన సంతోషం ఉండదు. హర్యానాలోని పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను బహుమతిగా ఇచ్చిన వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి సర్‌ప్రైజ్ గిఫ్ట్: రోజులాగే ఆఫీస్‌కు వెళ్లారు. తమ సీట్లలో కూర్చున్నారు. ఆఫీస్‌లో చాలా మంది ఉన్నారు కానీ.. వారిలో కొన్ని సీట్లలో మాత్రం ఏవో తాళాలు కనిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ 'కీ'స్ ఏంటని ఆరా తీశారు. ఇంతలోనే బాస్ వచ్చాడు. వారందరిని బయటకు తీసుకెళ్లాడు. అక్కడ మొత్తం 12 కార్లు ఉన్నాయి.. వాటికి క్లాత్ కప్పి ఉంది. 12 మందితో కార్లపై కవర్స్‌ను తీపించారు. వారందరికి ఆ కార్లను గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఆ 12మంది ఉద్యోగుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. విశేషం ఏంటంటే.. ఈ కార్లు గిఫ్ట్ తీసుకున్నవారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు. నువ్వు గ్రేట్ బాసూ: దీపావళి బహుమతిని అందుకున్నవారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉండడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆఫీస్ బాయ్ నిబద్ధతగా పని చేసినందుకు అతనికి కూడా కారు గిఫ్ట్ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంపెనీల్లో మేం జాయిన్ అయినా బాగుండేది కదు అని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి యాజమాన్యం ఉంటే ఇంకా హ్యాపీగా పని చేస్తామంటున్నారు. ఈ కంపెనీ యాజమాని భాటియా మాట్లాడుతూ 'తన కంపెనీ విజయానికి తన ఉద్యోగులకఠిన శ్రమ, అంకితభావం, విధేయత' కారణమని చెబుతున్నాడు. ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్ హెల్త్‌కేర్ మరో 38 మంది ఉద్యోగులకు కార్లను అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. Also Read: మూడు సార్లు చనిపోదాం అనుకున్నాడు.. కట్ చేస్తే ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు! Watch this: #viral-news #haryana-gift మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి