Republic Day: కళాకారుల కాళ్లు మొక్కిన సీఎం..వైరల్ వీడియో..!!

హర్యానాలో గణతంత్ర వేడుకల సదర్బంగా ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీరాముడికి సంబంధించిన నృత్య ప్రదర్శనను మెచ్చుకున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి ఆ కళాకారుల వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు.

New Update
Republic Day: కళాకారుల కాళ్లు మొక్కిన సీఎం..వైరల్ వీడియో..!!

Republic Day:దేశవ్యాప్తంగా గణతంత్ర దినోవత్సం (Republic Day)ఘనంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య వివిధ రంగాలు చేసిన చేసిన ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సారి దేశ రాజధాని ఢిల్లీలో నారీశక్తి పేరుతో త్రివిధ దళాలు చేపట్టిన కవాతు చూపుతిప్పుకోకుండా చేశాయి. పలు రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు, ఆయ రాష్ట్రాల సంస్క్రుతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలుగా నిలిచాయి. వాయు విన్యాసానాలు తల ఎత్తుకునేలా చేశాయి. చివరగా ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేసి వేడుకలను ముగించారు. దేశంలోపలు రాష్ట్రాల్లోనూ గణతంత్ర వేడుకల ఘనంగా జరిగాయి.

కాగా   హర్యానా(Haryana)లో గణతంత్ర వేడుకల సదర్బంగా ఆసక్తికర సంఘటన జరిగింది. రిపబ్లిక్ డే వేడుకల్లో శ్రీరాముడికి సంబంధించిన నృత్య ప్రదర్శనను మెచ్చుకున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar)ప్రొటోకాల్ ను బ్రేక్ చేసి మరీ ఆ కళాకారుల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా రామ, సీత, లక్ష్మణ వేషధారణలో ఉన్న ఆర్టిస్టులకు పాదాభివందనం(Kudos to the artists) చేశారు. అక్కడ ఉన్న ఇతర కళాకారులను సీఎం అభినందించారు. కర్నాల్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించారు ఖట్టర్ . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి:  ఈ స్కీంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే…వడ్డీలోంచి లక్షలు లెక్క పెట్టొచ్చు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చు. 

New Update

Weight Lose: సరైన ఆహారం తీసుకుంటే వేసవిలో బరువు తగ్గడం శీతాకాలంలో కంటే సులభం అవుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. శీతాకాలంలో బరువు తరచుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనం అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా..

వేసవిలో పుచ్చకాయ సులభంగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పండు. ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సలాడ్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా వంటి తక్కువ కేలరీల ఆహారాలు సులభంగా లభిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు

కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని పుదీనా, నిమ్మకాయ, బెర్రీలతో కలిపి తాగవచ్చు. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?

(weight-lose | weight-lose-exercises | vegetable-juices-for-weight-lose | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

 

Advertisment
Advertisment
Advertisment