Harish Rao: కేసీఆర్‌ను లేకుండా చేయాలని రేవంత్ కుట్ర.. హరీష్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను లేకుండా చేయాలని సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందని రేవంత్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్‌ను బాంబులతో లేపేస్తామని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు.

New Update
Harish Rao: కేసీఆర్‌ను లేకుండా చేయాలని రేవంత్ కుట్ర.. హరీష్ సంచలన వ్యాఖ్యలు

Harish Rao: ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించారు బీఆర్ఎస్ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందని రేవంత్ ఆలోచిస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్ ను బాంబులతో లేపేస్తాం అని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మెగా ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజం అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయినట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అన్నారం బ్యారేజిలో లోపాలు ఉంటే సరి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు.

చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారు: కేటీఆర్

మేడిగడ్డ బ్యారేజీలోని 86 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం నాడు ప్రాజెక్టు వద్ద పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు 100 అంకాలలో మేడిగడ్డ బ్యారేజీ ఒకటి అని తెలిపారు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డలో కేవలం 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని తెలిపారు. చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారని అన్నారు. తమపై కోపం ఉంటే తమ మీదనే చూపాలని కానీ రైతులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరించాలని కోరారు. అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్‌లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులపై పగపట్టొద్దని.. వరదలు వచ్చేలోగా ప్రాజెక్టును పునరుద్దరించాలని కేటీఆర్ కోరారు. గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాగర్జున సాగర్, శ్రీశైలం ప్రాజక్టుల్లోనూ లీకేజీలు వచ్చాయని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు