Hardik: శ్రీలంక టూర్ వేళ పాండ్యా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. తీవ్ర నిరాశకు గురిచేసిందంటూ!

2023 వన్డే ప్రపంచకప్‌ గాయం తననెంతో నిరాశకు గురి చేసింది హార్దిక్ పాండ్యా అన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ సాధించడంతో తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పాడు. జట్టుకోసం తాను చేసిన కృషికి ఇంతకంటే అద్భుతమైన ముగింపు మరొకటి ఉండదంటూ పోస్ట్ పెట్టాడు.

New Update
Hardik: శ్రీలంక టూర్ వేళ పాండ్యా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. తీవ్ర నిరాశకు గురిచేసిందంటూ!

T20 World Cup: టీమ్‌ఇండియా క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్య మరోసారి నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఇటీవల భారత్ టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాండ్యా.. 2023 వన్డే వరల్డ్ కప్ కోల్పోవడం తననెంతో నిరాశకు గురిచేసిందన్నాడు. అయితే ఇదే క్రమంలో పట్టు వదలకుండా ఎన్నో కష్టాలను దాటి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడటం మరెంతో సంతోషాన్నిచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు.

తీవ్ర నిరాశకు గురి చేసింది..
'2023 వన్డే ప్రపంచకప్‌లో నేను టోర్నీ మధ్యలోనే గాయపడటం తీవ్ర నిరాశకు గురి చేసింది. క్రికెట్ జర్నీ చాలా కష్టంగా మారింది. ఆటకు దూరంగా ఉండిపోయా. కానీ టీ20 ప్రపంచకప్‌ను భారత్ నెగ్గడంతో కష్టానికి ఫలితం దక్కింది. గత కొన్ని రోజులుగా చేసిన కృషికి ఇంతకంటే అద్భుతమైన ముగింపు మరొకటి ఉండదు. కఠోరమైన శ్రమ వృథా కాదనేందుకు ఇదొక నిదర్శనం. కష్టపడితే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది. మంచి ఫిట్‌నెస్‌ను సాధించేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉందాం’ అంటూ పోస్టులో రాసుకొచ్చాడు పాండ్యా. టీ20 ప్రపంచకప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 144 పరుగులు చేసిన పాండ్య11 వికెట్లు తీశాడు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 27నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత్ శ్రీలంక వెళ్లనుంది. శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్లను ఈ రోజు ప్రకటించనున్నారు. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ, టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు.

#hardik-pandya #2024-t20-world-cup #2023-worldcup
Advertisment
Advertisment
తాజా కథనాలు