Harbhajan Singh: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అక్మల్ కు ఇచ్చిపడేసిన హర్భజన్.. 

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై చెత్త వాగుడు వాగాడు. దీంతో పాటు సిక్కులను అవమానపరిచేలా మాట్లాడాడు. దీనికి హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. మీ తల్లులను.. చెల్లెళ్లను కాపాడింది సిక్కులు అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు. 

New Update
Harbhajan Singh: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అక్మల్ కు ఇచ్చిపడేసిన హర్భజన్.. 

Harbhajan Singh: 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది కానీ దాని మాజీ క్రికెటర్లు తమ దుష్ప్రవర్తనను మానుకోలేదు. న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పాక్ మాజీ క్రికెటర్.. బాబర్ అజం బంధువు కమ్రాన్ అక్మల్ సిక్కు మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, ఆ తర్వాత హర్భజన్ సింగ్ అతనికి తగిన సమాధానం ఇచ్చాడు.

కమ్రాన్‌కి హర్భజన్ ఘాటు సమాధానం..
Harbhajan Singh: ఓ షోలో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చివరి ఓవర్‌కు ముందు అర్ష్‌దీప్ సింగ్‌పై కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించాడు. అర్ష్‌దీప్ సింగ్ 20వ ఓవర్ వేస్తాడని, అతను కూడా పరుగులు ఇవ్వగలడని చెప్పాడు. ఇలా చెబుతూనే సిక్కు మతాన్ని అవమానించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కమ్రాన్ అక్మల్‌కు హర్భజన్ సింగ్ తగిన సమాధానం ఇచ్చాడు.

హర్భజన్ సింగ్ ఈ విషయంపై X లో చేసిన పోస్ట్ లో “కమ్రాన్ అక్మల్, సిగ్గుపడండి. నోరు తెరిచే ముందు మీరు సిక్కు మత చరిత్ర గురించి తెలుసుకోవాలి. మేము సిక్కులు మీ తల్లి.. సోదరీమణులను చొరబాటుదారుల నుండి రక్షించాము. అప్పటికి సమయం 12 గంటలు. మీరు కొంచెం కృతజ్ఞతతో ఉండాలి.” ఉండాలి అంటూ గట్టిగా ఇచ్చి పారేశాడు. 

అర్ష్‌దీప్ సింగ్‌ ఆటతో జవాబు..
Harbhajan Singh: కమ్రాన్ అక్మల్ అర్ష్‌దీప్ సింగ్‌ను తక్కువగా అంచనా వేయడానికి ప్రయత్నించాడు.  అయితే, ఈ ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ పాకిస్తాన్‌పై అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఆటగాడు 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 1 వికెట్ తీసి ఇమాద్ వసీంను పెవిలియన్ బాట పట్టించాడు. చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ 11 పరుగులు మాత్రమే వెచ్చించడంతో పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ప్రదర్శన ఆధారంగా, అతను కమ్రాన్ అక్మల్-పాకిస్తాన్‌ల నోరు మూయించాడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు