Harbhajan : ఇవేం చెత్త ప్రశ్నలు.. పాక్ జర్నలిస్టుపై హర్భజన్ ఫైర్! ధోనీని పాక్ ప్లేయర్ రిజ్వాన్‌తో పోలుస్తూ పోస్ట్ పెట్టిన పాక్ జర్నలిస్ట్‌పై హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'వీరిద్దరిలో ఎవరు’ అత్యుత్తమం?' అంటూ చెత్త ప్రశ్నలు అడగడం దారుణమన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ధోనీనే నంబర్ వన్ అన్నాడు బజ్జీ. By srinivas 20 Jul 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి MS Dhoni : భారత మాజీ క్రికెటర్ ధోనీని పాక్ యువ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ (Muhammad Rizwan) తో పోలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్ జర్నలిస్ట్ పై హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో నంబర్‌వన్ కెప్టెన్‌గా పేరొందిన ధోనీతో పెద్దగా అనుభవం లేని ఆటగాడిని పోల్చడం సరైనది కాదన్నాడు. రిజ్వాన్ బ్యాటింగ్ సత్తాను తక్కువ చేయనని, కానీ ధోనీతో సరితూగే ప్లేయర్ మాత్రం కాదని తన అభిప్రాయం వెల్లడించాడు. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4 — Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024 ఈ మేరకు పాకిస్థాన్ (Pakistan) క్రికెట్‌లో ఉత్తమమైన ఆటగాడిగా పేరొందుతోన్న మహ్మద్ రిజ్వాన్‌ను ధోనీతో పోలుస్తూ ఆ దేశ జర్నలిస్ట్ సోషల్ మీడియా (Social Media) లో పోస్టు పెట్టాడు. వీరిద్దరిలో ‘ఎవరు’ అత్యుత్తమం? అని ఫొటోకు క్యాప్షన్ జోడించాడు. దీంతో హర్భజన్ స్పందిస్తూ.. 'ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. రిజ్వాన్ కంటే ధోనీ చాలా ముందున్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజాయతీగా సమాధానం ఇవ్వాలి. రిజ్వాన్ ఆటను నేను కూడా ఇష్టపడతా. నిబద్ధతతో ఆడేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు. అయితే ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం తప్పు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో అతడే నంబర్ వన్. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా వ్యవహరించిన వికెట్ కీపర్లు చాలా అరుదు. ఆ జాబితాలో ధోనీనే టాప్’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. Also Read : ఎల్లుండి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ #ms-dhoni #harbhajan-singh #pak-journalist #muhammad-rizwan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి