/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-09T123602.310.jpg)
Karthika Deepam Serial Actress Amulya Gowda : సినీ పరిశ్రమ(Cine Industry) లో లైంగిక వేధింపులకు(Sexual Harassment) గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి మొదలు కొని స్టార్ హీరోయిన్స్ దాకా ఎంతో కాస్టింగ్ కౌచ్(Casting Couch) బారిన పడ్డవారే. ఈ విషయాన్ని కొందరు బహిరంగానే వెల్లడించారు. సినిమా నటీమణులకే కాదు సీరియల్ హీరోయిన్స్ కి కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా కార్తీక దీపం సీరియల్ నటి అమూల్య గౌడ(Amulya Gowda) లైంగిక వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది.
కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు
కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుంది అమూల్య గౌడ. ఈ సీరియల్ మొదట్లో ఆమె పాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఆ తరువాత కథలో ఆమె పాత్ర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం అమూల్య 'గుండెనిండా గుడిగంటలు' అనే సీరియల్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది.
ఇదిలా ఉంటే అమూల్య గౌడ తాజాగా లైంగిక వేధింపులకు గురైనట్లు సమాచారం. సూర్య అనే వ్యక్తి తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగికంగా వేధించాడని పోలీసులకు పిర్యాదు చేసింది.
Also Read : సీరియల్ నటికి బిగ్ షాక్.. నెట్టింట ప్రత్యక్షమైన అశ్లీల ఫోటోలు!
సూర్య అనే వ్యక్తి కాస్టింగ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడని, నన్ను ఆడిషన్ కి పిలిచి వెళ్లొచ్చాక అసభ్యకర మెసేజ్ లు పంపుతున్నాడని, లైంగికంగా వేధించడంతో అతన్ని నిలదీస్తే, పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకోమని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపింది. దీంతో సూర్య అనే వ్యక్తి పై కేస్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతడ్ని పట్టుకునే పనిలో ఉన్నారు.