Dussehra: ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే..! తెలంగాణ వ్యాప్తంగా నిండు కుండల్లా చెరువులు, కుంటలు ఉన్నాయన్నారు మంత్రి హరీశ్‌రావు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించింది బీఆర్‌ఎస్ సర్కారేనన్నారు. విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎండాకాలాన్ని వానకాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. By Trinath 23 Oct 2023 in Latest News In Telugu మెదక్ New Update షేర్ చేయండి ఎండాకాలాన్ని వానకాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR) కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish rao) అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ ను ఆయన సందర్శించి మాట్లాడారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది బిఆర్ఎస్ సర్కార్ మాత్రమేనన్నారు. సమైక్య పాలనలో చెరువుల్లో బతుకమ్మలు వేద్దామనుకుంటే నీళ్లు ఉండేవి కాదన్నారు. Also Read: 20ఏళ్ల నిరీక్షణకు తెర..అసలుసిసలైన టాపు, తోపు టీమిండియానే.. ! ట్యాంకర్ల ద్వారా చెరువుల్లో నీళ్లు పోసుకొని బతుకమ్మలను నిమజ్జనం చేసుకునే వారమన్నారు హరీశ్‌రావు. అదే సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చెరువులు కుండలు నిండుకుండల్ల నిండి ఉన్నాయన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారన్నారు. ప్రకృతిని ప్రేమించి పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ వారిది అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. సద్దుల తింటూ... సంబురం పంచకుంటు: బతుకమ్మ పండగ సందర్బంగా కోమటి చెరువు ఫై మంత్రి హరీష్ రావు ప్రజల తో వారు తెచ్చిన సద్దులు, పలహారలు కలిసి ఆత్మీయతను పంచుకున్నారు. విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరికి అన్నింటా శుభం చేకూరాలని.. తెలంగాణా ప్రజల జీవితం లో దసరాను మించిన పండుగ లేదు. దసరా పండుగలో మన సాంప్రదాయం, సంస్కృతితో పాటూ ఆత్మీయత ఉంది ఈ పర్వదినాన్ని ప్రజలందురు సుఖసంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. చెడు మీద మంచి విజయం సాధించే రోజు విజయ దశమి అని.. పాలపిట్టను చూస్తే శుభం కలిగినట్టే తెలంగాణ ప్రజలకు శుభం కలగాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధించిందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు, ప్రజల దీవెన ఎల్లపుడూ ఉండాలని.. దసరా పండుగ జిల్లాలో ప్రజలకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నారు. Also Read: సచిన్, కోహ్లీ, రోహిత్ వల్ల కూడా కాలేదు! గిల్ ఏం సాధించాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు! #cm-kcr #harish-rao #dussehra-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి