Mukesh Ambani Birthday: నేడు ముఖేశ్‌ అంబానీ బర్త్ డే.. ఆయన లైఫ్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా!

ముఖేశ్‌ అంబానీ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన అపారకుబేరుడు అని.. నిమిషానికి కోటి 17 లక్షలు సంపాదిస్తాడని.. అయితే ఇది మాత్రమే ఆయన జీవితం కాదు.. నేడు అంబానీ పుట్టిన రోజు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Mukesh Ambani Birthday: నేడు ముఖేశ్‌ అంబానీ బర్త్ డే.. ఆయన లైఫ్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా!

Mukesh Ambani Birthday: ముఖేశ్‌ అంబానీ సిక్రేట్‌ లైఫ్‌ను రివీల్ చేయబోతున్నాం. ముఖేశ్‌ అంబానీ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన అపారకుబేరుడు అని.. నిమిషానికి కోటి 17 లక్షలు సంపాదిస్తాడని.. అయితే ఇది మాత్రమే ఆయన జీవితం కాదు.. అంబానీ గురించి చాలామందికి తెలియని అనేక విషయాలు ఉన్నాయి. నీతాతో ముఖేశ్‌ ప్రేమ ఎపిసోడ్‌ తెలుసుకుంటే ఆయనలో మీకు రెమో కనిపిస్తాడు. తన పిల్లలతో ఆయనకున్న బంధాన్ని పరిశీలిస్తే ముఖేశ్‌ కూడా అందరిలాంటి సాధారణ, సామన్య తండ్రి లానే కనిపిస్తారు. ఎంత కుబేరుడైనా ఎమోషన్స్‌ పరంగా ఆయన మానవమాత్రుడే కదా.. ముఖేశ్‌ అంబానీలో చాలామందికి తెలియని కొణాన్ని, ఆయన ప్రేమ, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం..

భయపడ్డారట..
ముఖేశ్‌ , నీతా (Nita Ambani) ప్రేమకథ సినిమా కథ కంటే తక్కువ కాదు. తమ ప్రేమకథలోని ఆసక్తికరమైన ప్రయాణాన్ని చాలాసార్లు ఇంటర్వ్యూలలో వీరిద్దరూ చెప్పుకున్నారు. ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ ఓ కాలేజీలో జరిగిన ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో నీతాను మొదటిసారి చూశారు. ఆయన నీతాను చూసినప్పటి నుంచి ఆమెను తన కుటుంబానికి కోడలిగా చేసుకోవాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యారు. అప్పటినుంచి నీతాను కాంటెక్ట్‌ అయ్యేందుకు చాలా ప్రయత్నించారు. నీతా ఇంటి ఫోన్‌ నంబర్‌ తెలుసుకోని ఎన్నోసార్లు ఫోన్ కాల్ చేశారు. అయితే ఎవరో స్పై చేస్తున్నారని నీతా భయపడ్డారట..

ఎలిజబెత్ టేలర్ అంటూ..

ఒక సందర్భంలో ఫోన్ చేసి తను ధీరుబాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అని చెప్పగా.. నేను ఎలిజబెత్ టేలర్ అంటూ ఫోన్ పెట్టేశారట నీతా . ఆ తర్వాత ఆమె తండ్రి ఫోన్ తీయడంతో అసలు విషయం తెలిసింది. ఆ తర్వాత నీతా, ఆమె కుటుంబసభ్యులను ఇంటికి పిలిచారు. అప్పటినుంచి నీతా, ముఖేశ్‌ మధ్య పరిచయం ఏర్పడింది. చాలా కాలం ఇద్దరు కలిసి బయటకు వెళ్లేవారు. ఇలా ఓ సారి ముఖేశ్‌ నీతాకు ప్రపోజ్‌ చేశారు.

యస్ ఆర్ నో..
ఒకరోజు ముంబై పెడ్డార్ రోడ్డులో కారులో నీతా, ముఖేశ్‌ డ్రైవ్‌కు వెళ్లారు. సడన్‌గా కారును రోడ్డు మధ్యలో ఆపారు ముఖేశ్‌ . 'నీతా.. నన్ను పెళ్లి చేసుకుంటావా? జస్ట్ సే యస్ ఆర్ నో.. నౌ.' అని అడిగారు. ముఖేశ్‌ తన కారును అలానే ఆపి ఉంచడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.. ఓవైపు జనం అరుస్తున్నారు.. కార్ల నుంచి హారన్ల సౌండ్లు పెరిగిపోతున్నాయి. ఆ సమయంలో నీతా ముఖేశ్‌కు ఎస్‌ చెప్పారట. అయితే అప్పటికే నీతా మనసులో ముఖేశ్‌ భగ్న ప్రేమికుడిగా తిష్ట వేసుకోనే ఉన్నారు! ఏడాది పాటు ప్రేమలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. వీరి పెళ్లి 1985లో జరిగింది.

Also Read: Rohit Sharma - నాకు ఆ రూల్ నచ్చలేదు.. ఇలాగైతే ఆల్‌రౌండర్లు ఎదగలేరు!

పోటీపడుతూ..

ముఖేశ్‌ అంబానీ ఏప్రిల్ 19,1957న యెమెన్‌ దేశంలో జన్మించారు. 1970లలో అంబానీ కుటుంబం ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో ఒక చిన్న రెండు పడకగదుల ఇంట్లో ఉండేవారు. 1980లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం పాలిస్టర్ ఫిలమెంట్ యార్న్ ను ప్రారంభించింది. దీనిని ప్రయివేటు రంగానికి అప్పగిస్తూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులిచ్చింది. ధీరూభాయ్ అంబానీ, టాటా, బిర్లాతో పాటు దాదాపు మరో 43మంది వ్యాపారులతో పోటీపడుతూ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ధీరూభాయ్ కు లైసెన్స్ దక్కింది. అప్పటి నుంచి అంబానీ వెనుదిరిగి చూసుకోలేదు.

ఎంత ధనవంతుడైనా..
ముఖేశ్‌ అంబానీ ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబ జీవితాన్ని కూడా ఈక్వెల్‌గా బ్యాలెన్స్ చేసుకునేవారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి 2024లో జామ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాటలు ముఖేశ్‌ హర్ట్‌ను టచ్‌ చేశాయి. అనంత్ అంబానీ తన అనారోగ్యం సమస్యల గురించి చెబుతున్నప్పుడు ముఖేశ్‌ ఏడ్చేశారు. తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న ముఖేశ్‌ను చూస్తే ఆయనలోని సామాన్య తండ్రి కళ్లముందు కదలడతాడు. ఎంత ధనవంతుడైనా పిల్లలకు ముఖేశ్‌ ఓ సామాన్య తండ్రే కదా!

అన్నదమ్ముల మధ్య వివాదం
ఆయన కుటుంబ జీవితంలో మరో కోణం ఉంది. తన భార్య, పిల్లలతో సత్ససంబంధాలు కలిగి ఉన్న ముఖేశ్‌కు తన సొంత తమ్ముడితో మాత్రం వైరం ఉంది. ధీరూభాయ్ అంబానీ 2002లో కన్నుమూశారు. ధీరూభాయ్ ఎలాంటి వీలునామా చేయకపోవడంతో రిలయన్స్‌ను టేకోవర్ చేసేందుకు అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. ధీరూభాయ్ అంబానీ మరణానంతరం, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ బాధ్యతలు చేపట్టారు. అనిల్ అంబానీ వైస్ చైర్మన్ అయ్యారు. అయితే 2004లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం ముదిరింది. ఇది ధీరూభాయ్ వ్యాపార సామ్రాజ్య విభజనకు కారణమైంది.

బిలియనీర్ అయినప్పటికీ..

ప్రపంచంలో అత్యంత ధనిక పారిశ్రామికవేత్తల్లో ఒకరైయినప్పటికీ.. ముఖేశ్‌ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారు. ఆయన ఇప్పటి వరకు తాను మద్యం ముట్టుకోలేదు. బిలియనీర్ అయినప్పటికీ ముఖేశ్‌ ముంబై రోడ్ సైడ్‌లో పావ్ భాజీని తినడానికి ఇష్టపడతారు. ఆయన ఇప్పటికీ చదువుతారు, రాస్తారు, బోధిస్తారు. కొత్త టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటారు. మనకి తెలిసిన ముఖేశ్‌ వేరు.. ఆయన గడిపే జీవితం వేరు.. ఇదండి మన ముఖేశ్‌ గురించి చాలామందికి తెలియని కథ!

#mukesh-ambani
Advertisment
Advertisment
తాజా కథనాలు