Hanuman OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ అదే.. అందుకోసమే ఆరోజు!

హనుమాన్ ఓటీటీ రిలీజ్ తేదీ మరోసారి వాయిదా పడింది. హనుమాన్ మార్చి 8వ తేదీన జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమాన్ సినిమాను ఆ తేదీన విడుదల చేయాలని జీ5 సంస్థ అలాగే నిర్మాతలు ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. 

New Update
Hanuman OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ అదే.. అందుకోసమే ఆరోజు!

Hanuman OTT Release Date: ఈమధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన సినిమా ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు హనుమాన్ అని. అవును. చిన్న సినిమా అని తీసిపారేసిన వారే ముఖం మాడ్చుకునేలా.. విడుదల తేదీని మార్చుకోమన్న పెద్ద సినిమాల నిర్మాతలే తలలు దించుకునేలా.. సినిమా రిలీజ్ చేయడానికి థియేటర్లు లేక అవస్థలు పడి.. విడుదలైన తరువాత ప్రేక్షకుల అద్భుతమైన సపోర్ట్ తో ఏకంగా 300 థియేటర్లలో 30 రోజులు ఏకబికిన నడిచి.. ఇంకా నడుస్తూ రికార్డులు సృష్టిస్తోంది హనుమాన్. నెల రోజులు కాకుండానే థియేటర్లో జెండా పీకేసి.. ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతున్న బడా స్టార్ల సినిమాల రికార్డులను పక్కన పెట్టేసి.. ఓటీటీకి రావడానికి కూడా తేదీల వాయిదాలు తీసుకున్న సినిమా హనుమాన్. 

తేజ సజ్జా (Teja Sajja) హీరోగా.. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించిన సూపర్ హిట్ హనుమాన్ సినిమా ఇప్పుడు ఓటీటీకి రెడీ అయిపొయింది. అసలు మార్చి 1 నే ఈ సినిమా ఓటీటీలో వస్తుందని ప్రచారం జరిగింది. కానీ, మళ్ళీ వాయిదా పడింది. ఇంతకు ముందు కూడా రెండుసార్లు హనుమాన్ ఓటీటీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈసారి వాయిదా పడటానికి కారణం మార్చి 8వ తేదీన ఓటీటీకి తీసుకురావాలని ఓటీటీ హక్కులు తీసుకున్న జీ5 (Zee5) నిర్ణయించింది. దానికి కారణం కూడా ఉందట. మార్చి 8 ఉమెన్స్ డే. అంతేకాదు శివరాత్రి (Maha Shivratri) కూడా ఉంది. రెండు ప్రత్యేకమైన విశేషాలు కలిసి వస్తుండడంతో వాటి కానుకగా ప్రేక్షకులకు హనుమాన్ అందించాలని జీ5 ఫిక్స్ అయిందని చెబుతున్నారు.

Also Read: ఓటీటీలోనూ ఆ బొమ్మ హిట్టే.. ఆహాలో ప్రస్తుతం ఆ సినిమా బ్యాండే మోగుతోంది!

అయితే, దీనికి మరో కారణం కూడా ఉందని భావిస్తున్నారు. హనుమాన్ జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. మార్చి 1 నాటికి 50 రోజులు పూర్తి కావు. అదే మార్చి 8 అయితే, సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈమధ్య కాలంలో ఇంకా చెప్పాలంటే.. ఓటీటీ ట్రెండ్ పెరిగిపోయిన తరువాత ఇలా 50 రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాలు దాదాపుగా లేవు. ఎదో ఒకటో రెండో సినిమాలు ఐదో పదో థియేటర్లో ఇలా 50 రోజులు పూర్తి చేసుకున్నా.. ఆ సినిమాలన్నీ ఓటీటీలోకి ముందుగానే వచ్చేశాయి. అయితే, హనుమాన్ వీటికి విరుద్ధంగా అత్యధిక థియేటర్లో 50 రోజులు అంటే అర్ధ శతదినోత్సవం జరుపుకోబోతోంది. అందుకే 50 రోజుల తరువాత ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకువస్తున్నారని అంటున్నారు. 

ఏది ఏమైనా హనుమాన్ ఓటీటీ ఇంత ఆలస్యం కావడం కంటెంట్ ఉన్న సినిమాలకి ఎటువంటి విజయం దక్కుతుందో.. ఓటీటీలు కూడా రిలీజ్ చేయడానికి ఎందుకు తొందరపడరో రుజువు చేసిందని చెప్పవచ్చు.  ఇక హనుమాన్ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ 17 కోట్లరూపాయలు తీసుకున్నట్టు చెబుతున్నారు. 12 కోట్లు తెలుగు వెర్షన్ కి, 5 కోట్లు హిందీ వెర్షన్ కి సంస్థ చెల్లించిందని టాలీవుడ్ టాక్. 

Advertisment
Advertisment
తాజా కథనాలు