Delhi: చేతుల ట్రాన్స్‌ప్లాంటేషన్..ఢిల్లీ వైద్యుల మిరాకిల్

నేటి కాలంలో వైద్యం చాలా అభివృద్ధి చెందింది. డాక్టర్లు కూడా ఒక అడుగు ముందుకు వేసి అద్భుతాలను చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మిరాకిల్స్ సాధిస్తున్నారు. ఢిల్లీ వైద్యులు అలాంటి అద్భుతాన్నే చేశారు. రెండు చేతులనూ ట్రాన్స్‌ప్లాంట్ చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

New Update
Delhi: చేతుల ట్రాన్స్‌ప్లాంటేషన్..ఢిల్లీ వైద్యుల మిరాకిల్

Bilateral Hand Transplant: మనుషుల శరీరం చాలా వింతైనది. బోలెడు అవయవాలతో కూడి ఉంటుంది. ఇందులో ఏ పార్ట్ దెబ్బ తిన్నా చాలా కష్టం. విరిగితేనే అతుక్కోవడం చాలా టఫ్ అవుతుంది. అలాంటిది పూర్తిగా పోతే ఇంక అంతే సంగతులు. వాహనాలకు స్పేర్ పార్ట్స్ దొరికినట్లు మానవశరీరానికి మాత్రం దొరకవు. వైద్యం అభివృద్ధి చెందిన తరువాత కిడ్నీలు, గుండెల్లాంటివి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు. డోనర్స్ దొరికితే వైద్యులు ఈ ఆపరేషన్లను చాలా ఈజీగా చేసేస్తున్నారు. కానీ కాళ్ళు, చేతులు లాంటివి మాత్రం ఇప్పటివరకు అసాధ్యం. అయితే ఢిల్లీ వైద్యులు మాత్రం ఈ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశారు. వైద్యశాస్త్రంలో సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు.

ట్రైన్ యాక్సిడెంట్‌లో రెండు చేతులూ..

ఢిల్లీలో రెండు చేతులూ కోల్పోయిన చిత్రకారుడికి రెండు చేతులనూ అమర్చి అద్భుతాన్ని చేశారు వైద్యులు. ఒక రైలు ప్రమాదంలో పెయింటర్ రెండు చేతులనూ కోల్‌పోయారు. దాంతో ఆయన బాగా డీలా పడిపోయారు. జీవితంలో ఇంకెప్పటికీ ఆర్ట్ వేయలేనని అనుకున్నారు. కానీ దక్షిణ ఢిల్లీ స్కూల్ మాజీ అడ్మినేస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా పెయింటర్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీనా మెహతా బ్రెయన్ డెడ్‌తో చనిపోయారు. అంతకు ముందే ఆమె తన అవయవాలను దానం చేశారు. దీంతో మీనా అవయవాలను సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు (Ganga Ram Hospital) మరో నలుగురికి అమర్చారు.

publive-image

చేతుల ట్రాన్స్‌ప్లాంట్ ఇదే మొదటిసారి..

ఆవిధంగా ట్రైన్ యాక్సిడెంట్‌లో రెండు చేతులనూ పోగొట్టుకున్న పెయింటర్‌కు మీనా మెహతా చేతులను అమర్చారు. ఇలా చేతులను ట్రాన్స్‌ ప్లాంట్ చేయడం ఇదే మొదటిసారి. దానికి ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రి వైద్యులు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగారు. దీంతో 45 ఏళ్ళ పెయింటర్ తిరిగి మళ్ళీ చేతులను పొందగలిగారు. మీనా మెహతా కిడ్నీ, కాలేయం, కార్నియాలు కూడా మరో ముగ్గురికి అమర్చారు వైద్యులు.

పెయింటర్‌కు రెండు చేతులూ అమర్చడానికి వైద్యులకు 12 గంటల సమయం పట్టింది. అంత కష్టపడ్డాక ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో వైద్యులు సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. శస్త్రచికిత్స తరువాత పెయింటర్‌ కూడా త్వరగానే కోలుకున్నారు. డాక్టర్లతో పాటూ ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. తొందరలోనే ఈయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు.

Also Read:National: అమ్మ స్థానంలో కూతురు..రాహుల్ మాత్రం మళ్ళీ అక్కడి నుంచే..

Advertisment
Advertisment
తాజా కథనాలు