Ismail Haniyeh: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ మృతి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ హతమయ్యాడు. టెహ్రాన్‌లోని అతడి నివాసంపై దాడి చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో ఇస్మాయిల్ బాడీగార్డ్ సైతం మృతి చెందాడు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఇరానియన్ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. By V.J Reddy 31 Jul 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Hamas Chief Ismail Haniyeh: ఇరాన్‌లో ఇజ్రాయిల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. హమాస్ మూలాలే టార్గెట్ గా దాడులు చేసింది. ఈ దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హతమయ్యాడు. టెహ్రాన్‌లో (Tehran) ఇజ్రాయిల్ మెరుపు దాడులు చేసింది. వైమానిక దాడులతో ఇజ్రాయిల్ (Israel) రెచ్చిపోయింది. ఇస్మాయిల్‌తో పాటు బాడీగార్డ్ కూడా మృతి చెందాడు. ఇస్మాయిల్ ఇంటిపై వైమానిక దాడి చేశారు. హెజ్‌బొల్లా టార్గెట్‌గా ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయిల్ దాడి చేసింది. బీరుట్‌పై క్షిపణులు ఇజ్రాయిల్ ప్రయోగించింది. ఇజ్రాయిల్ దాడిలో భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. డ్రోన్ ద్వారా మూడు మిస్సైళ్లు ప్రయోగించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. #BREAKING The last pics of Ismail #Haniyeh in Tehran. pic.twitter.com/GcKvIDD9tC — Tehran Times (@TehranTimes79) July 31, 2024 💔🇵🇸 Before ISRAEL MURDERED Hamas’ Ismail Haniyeh today, the Zionists murdered 60 members of his family, including 3 of his children & 5 of his grandchildren. pic.twitter.com/nUqwlMjJ5E — Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) July 31, 2024 అక్టోబర్ 7న తమ దేశంలో జరిగిన రక్తపాతానికి ప్రతీకారం తీర్చుకుంది ఇజ్రాయెల్. గత 9 నెలలుగా ప్రతీకార మంటల్లో రగిలిపోతున్న ఇజ్రాయెల్.. బుధవారం తెల్లవారుజామున హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను హతమార్చింది. హమాస్ తన చీఫ్ మరణాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మంగళవారం (జూలై 30) ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సమయంలో, హనియా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని కూడా కలిశారు. మరుసటి రోజు (బుధవారం) అంటే ఈ తెల్లవారుజామున ఇస్మాయిల్ హనియా ఉంటున్న ఇంటిని ఇజ్రాయెల్ పేల్చివేసింది. Also Read: వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి కారణం మానవ తప్పిదమేనా? ఇటీవల ముగ్గురు కొడుకులు కూడా.. ఇటీవల (ఏప్రిల్ 2024), హనియా ముగ్గురు కుమారులు కూడా ఇజ్రాయెల్ భద్రతా దళాలచే చంపబడ్డారు. గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడిలో ఇజ్రాయెల్ హనియా ముగ్గురు కుమారులను హతమార్చింది. హనియా ముగ్గురు కుమారులు అమీర్, హజెమ్, మహమ్మద్‌లు గాజాలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించబోతున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ IDF తెలిపింది, అదే సమయంలో ముగ్గురూ వైమానిక దాడులకు గురయ్యారు. #iran #hamas #ismail-haniyeh #hamas-chief-ismail-haniyeh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి