IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. విశాఖ టెస్టుకు స్టార్‌ ప్లేయర్ ఔట్!

ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియాకు బిగ్ షాక్ ఎదురైంది. విశాఖ వేదికగా జరిగే రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కానున్నట్లుగా తెలుస్తోంది. జడేజా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లుగా సమాచారం.

New Update
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. విశాఖ టెస్టుకు స్టార్‌ ప్లేయర్ ఔట్!

INDIA VS ENGLAND 2nd test: ఇంగ్లండ్‌పై జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఓడిపోయింది. 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 231 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 202 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. హైదరాబాద్‌ గడ్డపై టీమిండియా టెస్టు మ్యాచ్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు, బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇక రెండో టెస్టు విశాఖలో జరగనుంది. ఫిబ్రవరి 2న ప్రారంభంకానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి షాక్‌ తగిలింది.


జడేజా ఆడడం డౌటే:
హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో జడేజా గాయపడ్డాడు. హామ్ స్ట్రింగ్ గాయంతో జడేజా బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 2న ప్రారంభమయ్యే విశాఖ టెస్ట్‌కు జడేజా దూరమయ్యే అవకాశం ఉంది. గాయపడిన ఆటగాళ్ల స్కాన్ నివేదికలను ముంబై ఇన్‌స్టిట్యూట్‌కు పంపిస్తారు. ఇవాళ(జనవరి 29)లోపు ప్రొఫెషనల్ మెడికల్ ఒపీనియన్‌ని అందించాల్సి ఉంటుంది. తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో జో రూట్ వేసిన బంతిని ఫేస్ చేసిన జడేజా పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బెన్ స్టోక్స్ నుంచి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నేరుగా త్రో పడింది. దీంతో జడేజా ఔటయ్యాడు.

మిడిలార్డర్‌ పోరాడినా:
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ పరాభవంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్ విజయంతో ఇంగ్లీష్‌ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. 7వికెట్లతో చెలరేగిన టాం హార్ట్‌లీ భారత జట్టు వెన్నువిరిచాడు. టాపార్డర్‌ విఫలమైనా టీమిండియా మిడిలార్డర్‌ ఇంగ్లండ్‌ స్పిన్నర్లను కొంతసేపు నిలువరించి పరుగులు రాబట్టగలిగింది. ఎనిమిదో వికెట్‌కు అశ్విన్‌-భరత్‌ 50 పరుగుల భాగస్వామ్యం పూర్తిచేయడంతో భారతజట్టు పరాజయం అంతరాన్ని తగ్గించుకోగలిగింది. 176 పరుగుల వద్ద భరత్‌, 182 పరుగుల వద్ద అశ్విన్‌ ఔటవడంతో టీమిండియా ఓటమి దఖాయమైంది. ఇక 202 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ విజయ లాంఛనం పూర్తయ్యింది. ఇంగ్లాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో హార్ట్లీ 7, జో రూట్‌ 1, జాక్‌ లీచ్‌ 1 వికెట్లు పడగొట్టారు.

Also Read: కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ కు బిగ్ షాక్ ఇచ్చిన వైజాగ్ పోలీసులు.. బాలుడు చనిపోవడంతో.. !

దేవిశ్రీ ప్రసాద్ కు వైజాగ్ పోలీసులు షాకిచ్చారు. ఈనెల 19న విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో దేవి మ్యూజికల్ కాన్సర్ట్ ఉండగా.. ఆ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ఇటీవలే స్పోర్ట్స్ క్లబ్‌ వాటర్ వరల్డ్‌లో ఓ బాలుడు మునిగి చనిపోగా భద్రత కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదు.

New Update
vaizag police shock to devi sri  prasad

vaizag police shock to devi sri prasad

Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ కు వైజాక్ పోలీసులు షాకిచ్చారు. ఈనెల 19న విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో దేవి మ్యూజికల్ కాన్సర్ట్ ఉండగా.. ఆ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ఇటీవలే స్పోర్ట్స్ క్లబ్‌ వాటర్ వరల్డ్‌లో ఓ బాలుడు మునిగి చనిపోగా భద్రత కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదు.

 

telugu-news | latest-news | cinema-news | devi-sri-prasad 

Advertisment
Advertisment
Advertisment